Karthikeya 2 First Day Collections : కార్తికేయ 2 ఫ‌స్ట్ డే కలెక్ష‌న్స్.. మాస్ భీబ‌త్సం

Authored By Sam C | The Telugu News | Published on: August 14, 2022, 1:00 pm

Karthikeya 2 First Day Collections : యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తీకేయ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా హల్‌చల్ చేస్తున్నది. 2004లో వచ్చిన కార్తీకేయ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా తొలి ఆట నుంచి మంచి టాక్‌తో దూసుకెళ్తున్నది. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం అన్ని భాషల్లోను భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఉదయం ఆటల తర్వాత టాక్ పాజిటివ్‌గా ఉండటంతో మధ్యాహ్నం, ఈవెనింగ్ షోలకు మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మంచి స్పందన వ్యక్తమైంది.

Karthikeya 2 First Day Collections : కార్తికేయ 2 క‌లెక్ష‌న్స్..

ఇండస్ట్రీ పాలిటిక్స్ వలన లేట్ అవుతూ వచ్చిన ఈ సినిమా లిమిటెడ్ రిలీజ్ ను ఇండిపెండెన్స్ వీకెండ్ లో సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 340 థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా మొదటి ఆటకే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవర్సీస్ లో దూసుకుపోతుంది. శనివారం హిందీలో కార్తికేయ-2 మూవీ కేవలం 50 షోలకే పరిమితమైంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో హిందీ రీజియన్లో డిమాండ్ పెరిగింది. తెరపై నిఖిల్ సిద్ధార్థ్ మ్యాజిక్‌ను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తమ రాష్ట్రాల్లో కార్తికేయ-2 హిందీ వర్షన్ షోలను పెంచాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం హిందీలో కార్తికేయ షోలను 150కి పెంచారు.

Karthikeya 2 First Day Collections Super Collections

Karthikeya 2 First Day Collections Super Collections

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల తర్వాత సినిమా 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ఖాయం అనుకోగా ఇప్పుడు సినిమా 3.5 కోట్ల రేంజ్ నుండి 3.7 కోట్ల దాకా ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఇంకా జోరు చూపించి సినిమా 4 కోట్ల రేంజ్ దాకా షేర్ ని రాబ‌ట్టే అవ‌కాశం ఉంది. వ‌రల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 4.8 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబ‌డుతుంద‌ని అంటున్నారు. దాదాపు 28 శాతం తొలి రోజే రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. కర్ణాటక, హిందీ ప్రాంతాల్లో కార్తీకేయ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ చిత్రాలకు ధీటుగా కార్తీకేయ 2 వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp