Katrina Kaif : అప్పుడంతా భయం భయం .. అందుకే అలా సీక్రెట్‌గా చేయాల్సి వచ్చిందన్న కత్రినా కైఫ్

Authored By mallesh | The Telugu News | Published on: September 2, 2022, 7:30 pm

katrina kaif : బాలీవుడ్ సుందరి కత్రినాకైఫ్ అందం, అభినయంతో పాటు ఆమె నటన గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఒకానొక టైంలో బాలీవుడ్‌లో కత్రినా టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. వరసగా హిట్స్, బాలీవుడ్ ఖాన్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నఈ ఇంగ్లీష్ భామ ఎట్టకేలకు ఒక యువహీరోను పెళ్లాడిన విషయం తెలిసిందే. అది కూడా కేవలం ఒక్క సినిమాతోనే క్రేజ్ సంపాదించుకున్న యంగ్ స్టార్ విక్కీకౌశల్. ఈ స్టార్ ‘ఉరి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే.

Katrina Kaif : బంధువులకు కరోనా.. అందుకే ఇలా..

కత్రినా కైఫ్ హిందీలోనే కాకుండా తెలుగులోనూ సినిమాలు చేసింది. విక్టరీ వెంకటేశ్‌తో మల్లీశ్వరి, ఆ తర్వాత బాలయ్య బాబుతో అల్ల‌రి పిడుగు సినిమాలో నటించింది. అందులో మల్లీశ్వరి సూపర్ హిట్ అవ్వగా.. అల్లరి పిడుగు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక తన కెరీయర్ మంచి ఊపు మీదున్న టైంలో కత్రినా సల్మాన్ ఖాన్ ప్రేమలో ఉన్నారని తెలియడంతో ఒక్కసారిగా రూమర్లు గుప్పుమన్నాయి. దీంతో ఆమె కెరీర్ కూడా కాస్త నెమ్మదించింది. ఈ రూమర్స్ వలన కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న కైఫ్.. మ‌ళ్లీ సినిమాలు చేసి తన క్రేజ్ పెంచుకుంది. ఉరి సినిమా విడుదల తర్వాత విక్కీ కౌశల్ మరియు క‌త్రినా లవ్ ట్రాక్ నడిపారు. దాదాపు మూడేళ్లు స‌హ‌జీవ‌నం చేసి గ‌తేడాది డిసింబ‌ర్‌లో వీరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

katrina kaif said that she had to do it secretly because of fear

katrina kaif said that she had to do it secretly because of fear

వీరి వివాహం రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ సిక్స్ సెన్సెస్ కోటలో అంగరంగ వైభవంగా జరిగింది.అయితే, ఈ పెళ్లికి సంబంధించిన వివరాలను కైఫ్ జంట చాలా గోప్యంగా ఉంచారు. తాజాగా ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో భర్త విక్కీ కౌశల్‌తో కలిసి హాజరైన కత్రినా మాట్లాడుతూ.. తమ పెళ్లి రహస్యంగా జ‌రగ‌డానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. కోవిడ్ వలన మా బంధువుల్లో చాలా మంది వైరస్ బారిన పడ్డారు. అందరినీ పిలిచి గ్రాండ్‌గా చేసుకోవాలి అనుకున్నాం. కానీ అందరూ వస్తే ఇంకా ఎంత మంది వైరస్ బారిన పడి ఇబ్బంది పడుతారో అని రహస్యంగా పెళ్లి చేసుకున్నాం అని కత్రినా చెప్పుకొచ్చింది. ఇదిలాఉండగా కత్రినా బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్‌తో నటించిన టైగర్ 3 మూవీ త్వరలోనే విడుదల కానుంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp