Katrina Kaif : రష్మిక లాగే కత్రినా కైఫ్… అసభ్యకరమైన ఫేక్ ఫోటో వైరల్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Katrina Kaif : రష్మిక లాగే కత్రినా కైఫ్… అసభ్యకరమైన ఫేక్ ఫోటో వైరల్ ..!

 Authored By aruna | The Telugu News | Updated on :9 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Katrina Kaif : రష్మిక లాగే కత్రినా కైఫ్...

  •  కత్రినా అసభ్యకరమైన ఫేక్ ఫోటో వైరల్ ..!

Katrina Kaif : ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు చెడు పనులకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలను అసభ్యంగా చూపిస్తున్నారు. మొన్ననే నేషనల్ క్రష్ రష్మిక ఏఐ టెక్నాలజీ ఉపయోగించి తన ఫేస్ ని మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ఇది దేశమంతటా వైరల్ గా మారింది. మొదట ఈ వీడియోలో ఉంది రష్మిక అని అందరూ అనుకున్నారు. అంతలా మార్ఫింగ్ చేశారు. నిశితంగా పరిశీలిస్తే ఈ వీడియోలో రష్మిక కాదు వేరే అమ్మాయిని తెలిసింది. దీంతో ఈ వీడియో చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు సైతం దీనిపై స్పందించారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

అయితే తాజాగా మరో హీరోయిన్ ఈ సమస్యను ఫేస్ చేస్తుంది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సైతం దీని బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఆమె ఫోటోని కూడా డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇందులో ఆమె దుస్తులు లేనివిధంగా చూపించారు. ఇదే ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ప్రస్తుతం కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ తో కలిసి ‘ టైగర్ 3 ‘ సినిమాలో నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈనెల 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో భాగంగా హాలీవుడ్ స్టంట్ ఉమెన్ తో కలిసి ఫైట్ చేస్తుంది. జస్ట్ టవల్ కట్టుకొని ఫైట్ చేయడం హైలైట్ గా నిలిచింది. కానీ ఇందులో కేవలం టవల్ మాత్రమే కాదు కత్రినా ఇన్నర్ గా వైట్ కట్ టవల్ ని ధరించింది.

దీంతో ఈ ఫేక్ ఫోటోపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని ఎంత దారుణంగా వాడుతున్నారో చూడండి అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. మంచి కంటే దీన్ని చెడు కోసం మరీ ముఖ్యంగా ఆడవాళ్లను అసభ్యంగా చూపించడం కోసం వాడుతున్నారని, దీనిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కత్రినా తో పాటు సచిన్ కూతురు సారా కూడా దీని బారిన పడినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇకనైనా దీనిపై స్పందించి ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది