Keerthy Suresh : బిగ్ న్యూస్.. కీర్తి సురేష్ పెళ్లి – పెళ్లి కొడుకు ఇతనే !
Keerthy Suresh : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ నేను శైలజ ‘ సినిమాలో హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది కీర్తి సురేష్. ఆ తర్వాత ‘ మహానటి ‘ సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది. తాజాగా కీర్తి సురేష్ నాని ‘ దసరా ‘ సినిమాలో వెన్నెల పాత్రలో నటించింది. నాచురల్ లుక్ తో మహానటి తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
అయితే గత కొద్దికాలంగా కీర్తి సురేష్ మీద రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కెరీర్ స్టార్టింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు వినిపించాయి. వీటిపై క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్లీ ఆమె పెళ్లికి రెడీ అవుతుందని టాక్ వినిపించింది. కేరళకు చెందిన ఓ వ్యాపారవేతతో కీర్తి సురేష్ పెళ్లి నిశ్చయమైందని జోరుగా ప్రచారం జరిగింది. తర్వాత తమిళ స్టార్ దళపతి విజయ్ కీర్తి సురేష్ తో డేట్ చేస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. కీర్తి సురేష్ కోసం విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా కీర్తి సురేష్ తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి వార్తలపై వస్తున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు. ఒక అభిమాని పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించారు. దానికి బదులుగా కీర్తి సురేష్ తనకి సరిపోయే కరెక్ట్ అబ్బాయి ఇంకా దొరకలేదని, దొరికినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను అని చెప్పింది. ఇప్పటికైనా ఆమెపై వస్తున్న రూమర్స్ కి పులిస్టాప్ పడుతుందో లేదో చూడాలి. ఇకపోతే కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళంలో జయం రవి నటిస్తున్న ఇండియన్ మూవీ సెరిన్ లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.