KGF Movie : కేజీఎఫ్‌ ఎఫెక్ట్‌… నాలుగు హత్యలు చేసిన 19 ఏళ్ల కుర్రాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KGF Movie : కేజీఎఫ్‌ ఎఫెక్ట్‌… నాలుగు హత్యలు చేసిన 19 ఏళ్ల కుర్రాడు

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2022,4:30 pm

KGF Movie : సినిమా అనేది సమాజం మీద అధికంగా ప్రభావం చూపిస్తుంది, సినిమాలో చూపించినట్లుగా తామ చేయాలని.. సినిమాలో కనిపించినట్లుగా తాము కనిపించాలని యువత భావిస్తూ ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడా సినిమాలను చూసి ఇన్స్పైర్ అవ్వడం చాలా జరుగుతుంది. కనుక సమాజం తప్పుదోవ నడవకుండా ఉండేలా సినీ మేకర్స్ బాధ్యతహితంగా సినిమాలను తీయాలంటూ పెద్దలు అంటూ ఉంటారు. ఎంత మంది ఎన్ని చెప్పినా కూడా హింసాత్మక సన్నివేశాలతో సినిమాలను తీయడం, యువత పెడద్రోవ పట్టే విధంగా అసాంఘిక కార్యక్రమాలను సినిమాల్లో చూపించడం పరిపాటి అయింది..

తాజాగా మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన శివ ప్రసాద్ అనే 19 ఏళ్ల కుర్రాడు వరుసగా నలుగురి సెక్యూరిటీ గార్డులను చంపేశాడు. మొదట హత్యలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారో పోలీసులకు అర్థం కాలేదు. ఇటీవలే పోలీసులు వరుస హత్యలకు పాల్పడుతున్న శివ ప్రసాద్ ని పట్టుకున్నారు. అతడిని ఎంక్వయిరీ చేసిన సమయంలో అతడు చెప్పిన విషయాలకు పోలీసులు నోరు వెళ్ళ బెట్టారు. నీతో ఎలాంటి సంబంధం లేని ఆ నలుగురిని ఎందుకు నువ్వు చంపావు వారితో ఏమైనా గొడవ ఉందా నీకు అంటూ పోలీసులు ప్రశ్నించగా వారితో తనకు ఎలాంటి గొడవ లేదని వారు తనకు తెలియనే తెలియదు అని అతడు చెప్పాడు.

KGF Movie and hero yash inspired serial killer in madhya pradesh

KGF Movie and hero yash inspired serial killer in madhya pradesh

మరి ఎందుకు చంపావు అంటూ పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా అప్పుడు శివ ప్రసాద్ అసలు విషయాన్ని చెప్పాడు. తనకు కేజీఎఫ్ సినిమా అంటే ఇష్టమని అందులో రాఖీ బాయ్ ఎలా అయితే గ్యాంగ్‌స్టర్‌ గా మారాడు తాను కూడా అలాగే గ్యాంగ్‌స్టర్‌ గా మారాలి అనుకొని వరుస హత్యలు చేస్తున్నానని, అలా చేయడం వల్ల తాను బయటకు వెళ్ళినప్పుడు నలుగురు భయపడతారని అలా తాను రౌడీగా గ్యాంగ్ స్టర్ గా మారినట్లు అవుతుందని భావించాను అంటూ చెప్పుకొచ్చాడు. అతడి మాటలకు పోలీసులు మాత్రమే కాకుండా ఇప్పుడు దేశం మొత్తం నోరు వేళ బెడుతోంది. మరి కేజిఎఫ్ టీం ఈ క్రైమ్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది