Pawan Kalyan : ఖుషి ఎంత పని చేసింది..పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ దేవరకొండ..!
Pawan Kalyan : ఖుషి.. ఈ పేరు వింటే పవన్ కళ్యాణ్ అభిమానులకి పూనకాలు రావడం సహజం. మరి ఈ సినిమా పవన్ కెరియర్‌లో అంత స్పెషల్‌గా మారింది. ఎస్.జె. సూర్య డైరెక్షన్లో భూమిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పవన్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఈ మూవీ టైటిల్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ – సమంత కలిసి నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీకి పెట్టేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. అయితే విజయ్ దేవరకొండ చిత్రానికి `ఖుషీ` అనే టైటిల్ ని పెట్టడం చాలా మంది పవన్ అభిమానులు అంగీకరించడం లేదు.
తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.`ఖుషీ` పవన్ కల్యాణ్ కెరీర్ క్లాసిక్. మరి అలాంటి టైటిల్ ని మరో హీరో పెట్టుకోవడం తమకు నచ్చడం లేదని రిలీజ్ చేసిన పోస్టర్ టైటిల్ డిజైన్ అంతగా లేదని వాదిస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి క్లాసిక్ టైటిల్ ని మరొకరు వాడకుండా నిర్మాత అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందని కొంత మంది నెటిజన్ లు వాపోతున్నారు.గతంలో వరుణ్ తేజ్ పవన్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ `తొలి ప్రేమ` టైటిల్ ని తీసుకుని ఓ సినిమా చేశాడు. అది ఫరవాలేదనిపించింది. తను తన సోదరుడి తనయుడు కాబట్టి ఫ్యాన్స్ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ విజయ్ దేవరకొండ బయటి వ్యక్తి. ఇప్పడు ఇదే పవన్ ఫ్యాన్స్ ని ఇబ్బందిపెడుతోంది.
Pawan Kalyan : గట్టి వార్ నడుస్తుందిగా..!
తమ హీరో టైటిల్ ని బయటి హీరో తీసుకోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే `ఖుషీ` టైటిల్ విషయంలో కామెంట్ లు చేస్తున్నారట. అయితే దీనికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కౌంటర్ లు వేస్తున్నారు. `తొలిప్రేమ` టైటిల్ ని వరుణ్ తేజ్ ఉపయోగించుకున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పడు విజయ్ `ఖుషీ` టైటిల్ ని వాడటంతో జనాలు అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? . విజయ్ పట్ల ఎందుకు అంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తను బయటి వ్యక్తి కావడం వల్ల.. తెలుగు ఇండస్ట్రీలో ఊహించని విధంగా విజయ్ ఎదుగుతున్నాడనే ఇలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారా? అంటూ విజయ్ అభిమాని గట్టి కౌంటర్ వేయడం ఆసక్తికరంగా మారింది.