Samantha : శంకర్ – రామ్ చరణ్ సినిమా లో కియారా అద్వానిని రీప్లేస్ చేయబోతోన్న సమంత .. నాగ చైతన్య కి రగిలిపోతోంది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : శంకర్ – రామ్ చరణ్ సినిమా లో కియారా అద్వానిని రీప్లేస్ చేయబోతోన్న సమంత .. నాగ చైతన్య కి రగిలిపోతోంది..?

 Authored By ramesh | The Telugu News | Updated on :6 October 2022,7:00 pm

Samantha : ఆర్ఆర్ఆర్ తర్వాత రాం చరణ్ సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని నటిస్తుంది. సినిమాలో చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో కియరా అద్వానికి బదులుగా సమంతని రీప్లేస్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ చరణ్ తో సమంత రంగస్థలం సినిమాలో నటించింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఆర్సీ 15 సినిమాలో కూడా సమంత నటిస్తుందని టాక్. కియరా కోసం అనుకున్న ఆ పాత్రలో ఆమె ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని.. అందుకే ఆమె ప్లేస్ లో సమంతని తీసుకున్నారని అంటున్నారు. అయితే ఈ విషయం తెలిసి అక్కినేని కాంపౌండ్ లో రగడ మొదలైంది. అక్కినేని ఫ్యామిలీకి దూరమైన తర్వాత సమంత మళ్లీ తిరిగి ఫాం లోకి రావడం అక్కినేని ఫ్యామిలీకి ఇబ్బంది కరంగా ఉంది. అందుకే ఆమెకు ఛాన్స్ వస్తుందని తెలిస్తే చాలు నాగ చైతన్యకు రగిలిపోతుందని తెలుస్తుంది. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా సమంత నటిస్తుందని తెలిసి చైతు అప్సెట్ లో ఉన్నాడని టాక్. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తుంది.

Kiara Advani replaced with samantha rc15 movie new update

దీనితో పాటుగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో సమంత తన మునుపటి ఫాం కొనసాగించాలని చూస్తుంది. ఇదే ఊపులో చరణ్ సినిమా ఛాన్స్ కూడా అందుకుంటే మాత్రం ఇక ఆమెకి తిరుగు ఉండదని చెప్పొచ్చు. తెలుగులోనే కాదు హిందీలో కూడా సమంత అదరగొట్టేస్తుంది. ఫ్యామిలీ మెన్ 2 తర్వాత సమంతకి హిందీలో భారీ ఆఫర్లు వస్తున్నాయి. తప్పకుండా సమంత అక్కడ కూడా చక్రం తిప్పేలా ఉందని చెప్పొచ్చు. తెలుగులో రాబోతున్న 3 సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా సమంతకి ఇక్కడ కూడా వరుస ఛాన్సులు వస్తాయి. డైవర్స్ తర్వాత రెచ్చిపోతున్న సమంతని చూసి అక్కినేని కాంపౌండ్ కొద్దిగా అప్సెట్ లోఉన్నారట.

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది