Home » Entertainment » Koratala Shiva Crazy Project With Balakrishna
Entertainment

Balakrishna : బాల‌కృష్ణ‌ తో కొర‌టాల శివ‌ క్రేజీ ప్రాజెక్ట్… టైటిల్ కే పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్

Authored By
aruna
The Telugu News | Published on: July 31, 2022, 2:20 pm
Advertisement

Balakrishna : అఖండ సినిమాతో బాల‌కృష్ణ‌ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమాలో బాల‌య్య బాబు విశ్వ‌రూపం చూపించాడు. పెద్ద బ్యాన‌ర్లు, అగ్ర నిర్మాత‌లు బాల‌కృష్ణ‌ ఛాన్స్ కోసం తిరుగుతున్నార‌ట‌. ఒక‌ప్పుడు ప్లాప్స్ ఉన్న‌ప్పుడు బాల‌కృష్ణ‌ తో సినిమాకు ఆస‌క్తి చూప‌ని డైరెక్ట‌ర్లు కూడా ఇప్పుడు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే బోయ‌పాటి శ్రీను, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరీ జ‌గ‌న్నాథ్ ఉన్నాడు. ఈ లిస్టులోకి ఇప్ప‌డు బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ వ‌చ్చి చేర‌బోతున్నాడు. బాల‌కృష్ణ‌ కోసం ఒక ప‌వ‌ర్ ఫుల్ క‌థ సిద్దం చేశాడ‌ట‌. కొర‌టాల శివ ఇప్ప‌టికే నంద‌మూరి హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో జ‌న‌తా గ్యారేజ్ లాంటి సూప‌ర్ హిట్ సినిమాను అందించాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ 30 వ సినిమాను కూడా కొర‌టాల శివ‌ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

శివ కెరీర్ లో ఒక్క ఆచార్య త‌ప్పితే అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లే.. అని చెప్పాలి. ఆచార్య ఆయ‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసినా అంతా కొర‌టాల శివ‌ ఖాతాలో వేయ‌టం కూడా స‌రికాదు. చిరంజీవి స్వ‌యంగా కొన్ని సుచ‌న‌లు చేయ‌టంతో పాటు, క‌రోనా కార‌ణంగా సినిమా ఆల్య‌సం కావ‌టం, క‌థ‌లో మ‌ర్పులు చేయ‌టం కూడా ఆచార్య ప‌రాజ‌యానికి ప్ర‌ధాన కార‌ణాలు అని చెప్ప‌వ‌చ్చు. ఇక మొన్న‌టి వ‌ర‌కు కూడా ఆచార్య న‌ష్టాలు కొర‌టాల‌ శివ‌ను వెంటాడాయి. ఇక ఇప్పుడిప్పుడే అంతా స‌ద్దుమ‌ణుగుతోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో సినిమా తెర‌కెక్కిస్తున్న కొర‌టాల శివ‌ ఆ త‌ర్వాత న‌ట‌సింహం బాల‌కృష్ణతో మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తుంది.

Koratala Shiva crazy project with Balakrishna..

Advertisement

Balakrishna : పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్…

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలోనే బాల‌కృష్ణ‌ కోసం కొర‌టాల శివ‌ ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ను రెడీ చేశార‌ట. ఈ క‌థ‌ను బాల‌కృష్ణ‌ మాత్ర‌మే చేయ‌గ‌ల‌డు అని.. స‌మ‌కాలిన రాజ‌కీయ అంశాల‌తో కూడిన ఈ క‌థ‌లో బాల‌కృష్ణ‌ చ‌క్క‌గా సెట్ అవుతారు అని కొర‌టాల భావిస్తున్నార‌ట‌. ఇక ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో పొలిటిక‌ల్ హిట్ మూవీ భ‌ర‌త్ అనే నేను సినిమా తీసి సూప‌ర్ హిట్ అందుకున్నారు.. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌ తో కూడా పొలిటిక‌ల్ నేప‌థ్యం ఉన్న క‌థ‌నే వినిపించాడ‌ని టాక్.

Balakrishna : ఎన్టీఆర్ మూవీ త‌ర్వాత‌…

బాల‌కృష్ణ‌తో సినిమాలు చేసేందుకు చాలా మంది స్టార్ డైరెక్ట‌ర్‌లు ఉత్సాహంతో ఉన్నారు. ఈ లిస్ట్‌లోనే కొర‌టాల శివ‌ కూడా గ‌త రెండు, మూడు సంవ‌త్స‌రాలుగా త‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌న్న విష‌యం తెలిసిందే. ఇక లాక్ డౌన్ స‌మ‌యంలోనే కొర‌టాల బాల‌య్య కోసం రెడీ చేసిన క‌థ‌ను బాల‌కృష్ణ‌ కు ఇప్ప‌టికే వినిపించార‌ని స‌మాచారం. ఇక బాల‌కృష్ణ‌ కూడా క‌థ న‌చ్చ‌డంతో ఒకే చేశార‌ని.. ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ప‌రిశిలిస్తున్నారు అని కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్. అన్ని సెట్ అవుతే ఎన్టీఆర్ తో చేస్తున్న ప్రాజెక్ట్ త‌ర్వాత ఈ సినిమా సెట్స్‌ మీద‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ కాంబినేష‌న్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేస్తే నంద‌మూరి ఫ్యాన్స్ పండ‌గ‌ చేసుకుంటారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి