Jr NTR and Koratala Siva movie new update
JR NTR : ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా, ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత రామ్ చరణ్ తన కొత్త ప్రాజెక్ట్ చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మాత్రం ఇంతవరకు మొదలు కాలేదు. దీనిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని కూడా డైరెక్టర్ కొరటాల శివ కొద్ది రోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి నుంచి దీనికోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జూలై నెల కూడా వచ్చేసింది. కానీ, సినిమా ప్రారంభం గురించి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో రాబోయే ఈ సినిమాను జూలైలో ప్రారంభించడం లేదట. సెప్టెంబర్ నెల నుంచి మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. ఇందుకు గల కారణాలు మాత్రం బయటకు రాలేదు.
Koratala Siva Jr NTR movie shooting on september
కానీ, ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవడంతో నందమూరి ఫ్యాన్స్‌లో మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు.. అన్ని సిస్టమ్‌లను ఎదురించే శక్తిలా ఎలా ఎదిగాడు అన్న కథతో ఇది రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.