Home » Entertainment » Babu Mohan Shares About Bad Incident
Entertainment

Babu Mohan : బాబు మోహ‌న్‌ని పాన్‌లో విషం పెట్టి చంపాల‌నుకున్నారా..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 10, 2022, 8:30 pm
Advertisement

Babu Mohanఒక‌ప్పుడు టాలీవుడ్ పాపుల‌ర్ క‌మెడీయ‌న్స్‌లో బాబు మోహ‌న్ ఒక‌రు. ఆయ‌న కామెడీకి ప్ర‌తి ఒక్క‌రు ప‌డిప‌డి న‌వ్వే వాళ్లు. విభిన్న పాత్ర‌ల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం పంచాడు బాబు మోహ‌న్.బాబు మోహన్ అనగానే అందరికీ కూడా కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో చేసిన కామెడీ సీన్స్ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. వీరిద్దరూ కలిసి వెండి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు పగలబడి నవ్వుకునే వారు. అప్పట్లో వారు ఉంటే సినిమా సక్సెస్ అయ్యేది అనే ఒక సెంటిమెంట్ కూడా ఉండేది. వందలాది సినిమాల్లో నటించిన ఆయన కొన్ని సినిమాల్లో కీలకపాత్రలో కూడా కనిపించారు. పాజిటివ్ నెగిటివ్ రోల్స్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపించారు.

Advertisement

అలాగే టెలివిజన్ రంగంలో కూడా ఆయన కొన్ని సీరియల్స్ లో నటించారు. రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా అలాగే మరొకసారి మంత్రిగా కూడా కొనసాగారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కూడా కొనసాగుతూ అనంతరం విభేదాలతో ఆ పార్టీ నుంచి తప్పుకొని బీజేపీలో చేరారు. అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ.. ప్రస్తుతం బిజిబిజీగా ఉంటున్నారు నటుడు బాబు మోహన్ తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ.. తనను విషం పెట్టి చంపాలని చూశారని సంచలన విషయాలు బయటపెట్టారు. ఒక‌ప్పుడు పాన్ అంటే చీచీ అనే వాడిని కాని త‌ర్వాత అల‌వాటైంది.

babu mohan shares about bad incident

Advertisement

Babu Mohan : రాజ‌కీయాల ఎఫెక్ట్..

సంగారెడ్డిలో ఉన్న ఓ పాన్ డబ్బాలో తాను ఎప్పుడు పాన్ కట్టించుకుని తినేవాడినని చెప్పారు బాబు మోహన్. నిత్యం 30 నుంచి 40 వరకు పాన్‌లు తినేవాడినని అన్నారు. ‘ఆ డబ్బాలో నేను నిత్యం పాన్ తీసుకుంటున్నట్లు కొందరు తెలుసుకున్నారు. నేను మాములుగానే పాన్ కట్టించుకుని కారు పెట్టుకుని వెళ్లిపోయాను. కొంతదూరం వెళ్లిన తరువాత పాన్ తిందామనే ఓపెన్ చేశా..కరెక్ట్‌గా ఆ సమయంలోనే ఓ మహిళ నుంచి నాకు ఫోన్ వచ్చింది. సార్ ఆ పాన్ తినకండని.. అందులో విషం కలిపారని చెప్పింది. నేను వెంటనే ఆ పాన్‌ను పక్కన పడేశాను. కాసేపటి తరువాత మళ్లీ ఆమె ఫోన్ చేసింది. ఆమె ఎవరో కాదు.. నాకు పాన్ కట్టించిన వ్యక్తి భార్యనే. కొందరు వ్యక్తులు బెదిరించడంతో పాన్‌లో విషంలో కలిపినట్లు చెప్పింది. తప్పయిపోయింది సార్ అంటూ ఏడ్చింద‌ని చెప్పుకొచ్చారు బాబు మోహన్.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి