Koratala Siva : ఆచార్య కష్టాలు అన్నీ ఇన్నీ కాదయ.. కొరటాల శివకు దెబ్బ మీద దెబ్బ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Koratala Siva : ఆచార్య కష్టాలు అన్నీ ఇన్నీ కాదయ.. కొరటాల శివకు దెబ్బ మీద దెబ్బ

 Authored By prabhas | The Telugu News | Updated on :20 July 2022,7:30 pm

Koratala Siva : కొరటాల శివ అంతా తానై తెరకెక్కించిన ఆచార్య సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్లలో నంబర్ వన్ స్థానంలో ఉండగలిగే సత్తా కేవలం ఆచార్యకే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆచార్య దెబ్బకు కొరటాల మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆస్తులన్నీ అమ్ముకునే పరిస్థితి వచ్చేలా ఉంది. ఆచార్య బిజినెస్ విషయంలో కొరటాల ముందు నుంచి చురుగ్గానే ఉన్నాడు. అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లకు అమ్మేశాడు. సినిమా మీద హైప్ కూడా అలానే ఏర్పడింది. కానీ మొదటి రోజే తేడా కొట్టేసింది. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో 80 నుంచి వంద కోట్ల వరకు నష్టవాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రతీ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు కోట్లకు కోట్లు నష్టపోయారు. దీంతో వారంతా కలిసి కొరటాల ఆఫీస్‌ను చుట్టుముట్టారట.

వారికి కొరటాల ఎంతో కొంత ఇచ్చి పంపించారట. అయితే కొరటాలకు డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో భారీగానే రావాల్సి ఉంది.కానీ చివరకు వారంతా కూడా చేతులెత్తేశారు. సినిమాలో ముందు కాజల్ ఉండేది.. కానీ ఇప్పుడు లేదు అంటూ సాకుగా చూపుతూ వారంతా కూడా మొహం తిప్పేసుకుంటున్నారట. శాటిలైట్ రూపంలో జెమీని నుంచి ఈ సినిమాకు ఏకంగా రూ.15 కోట్ల‌ు రావాల్సి ఉందని తెలుస్తోంది. ఆ డ‌బ్బులు ఇంకా రాలేదట. అవొస్తే… కొర‌టాల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ద‌క్కేది. కానీ ఇప్పుడు ఆ డ‌బ్బులు కూడా రిస్కులో ప‌డిపోయాయని తెలుస్తోంది. ఈ సినిమాని విడుద‌ల‌కు ముందే కొనేసింది జెమినీ. అయితే సినిమా ఫ్లాప‌య్యింది. టీవీల్లో కూడా రేటింగులు రాని ప‌రిస్థితి. రేటింగులు రాక‌పోతే… యాడ్లు ఉండ‌వు. అలా.. ఈ సినిమాతో జెమినీ కూడా న‌ష్ట‌పోవాలి.

Koratala Siva Loss For Acharya From Gemini Satellite Rights

Koratala Siva Loss For Acharya From Gemini Satellite Rights

అందుకే ఇప్పుడు ఆ రూ.15 కోట్లు ఇవ్వ‌డానికి జెమినీ ఒప్పుకోవ‌డం లేదని తెలుస్తోంది. శాటిలైట్ స‌మ‌యంలో చేసుకొన్న ఎగ్రిమెంట్ల‌ని చూపిస్తోంది. జెమినీకి ఈ సినిమా అమ్మేస్తున్న‌ప్పుడు.. ఆచార్య‌లో కాజ‌ల్ ఉంది. ఇప్పుడు ఆమె లేదు. ఆ సాకు చూపించి `ఈ సినిమా మాకొద్దు.. మీరే ఉంచుకోండి` అని వెన‌క్కి ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ట‌. లేదంటే. రూ.7.5 కోట్ల‌కు డీల్ చేసుకొందాం.. అని అడుగుతోంద‌ట‌. సినిమాని వెన‌క్కి తీసుకొంటే, జెమినీ నుంచి తీసుకొన్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి. స‌గానికి స‌ర్దుకుపోతే, రూ.7.5 కోట్లు న‌ష్ట‌పోయిన‌ట్టు. ఈ వ్య‌వ‌హారం కూడా ఇప్పుడు కొర‌టాల‌కు కొత్త చిక్కుల్ని తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. మొత్తానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఆచార్య కష్టాలు కొరటాలను నీడలా వెంటాడుతూనే ఉన్నాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది