Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని చెప్పాలి. త‌న త‌న‌యుడు రామ్ చ‌రణ్‌తో చేసిన ఆచార్య మాత్రం డిజాస్ట‌ర్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ కావ‌డానికి కొర‌టాల శివ అని ప‌లు సంద‌ర్భాల‌లో ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు చిరు. అయితే ప్ర‌స్తుతం కొరటాల త‌న తాజా చిత్రం దేవ‌ర మూవీ ప్రమోష‌న్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో తెలుగు యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 September 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని చెప్పాలి. త‌న త‌న‌యుడు రామ్ చ‌రణ్‌తో చేసిన ఆచార్య మాత్రం డిజాస్ట‌ర్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ కావ‌డానికి కొర‌టాల శివ అని ప‌లు సంద‌ర్భాల‌లో ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు చిరు. అయితే ప్ర‌స్తుతం కొరటాల త‌న తాజా చిత్రం దేవ‌ర మూవీ ప్రమోష‌న్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో తెలుగు యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్.. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివతో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ ఎవరు చేసే పనిని వారు ప్రశాంతంగా చేసుకోనివ్వాలని, అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు. అవసరం లేకపోయినా ఇబ్బంది పెట్టడం, మన పనిని మనం చేయనివ్వకుండా అడ్డుపడటం, తామే బాధ్యత తీసుకోవడం లాంటివన్నీ కష్టమన్నారు.

Koratala Siva కొర‌టాల పంచ్..

కొరటాల కూడా ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి పైనే కౌంటర్ వేసిన మాటలు వైరల్ గా మారాయి. మన పని మనల్ని చేసుకోనివ్వాలి అని ప్రతి దానిలో ఎవరూ వేలు పెట్టి డిస్టబ్ చెయ్యకూడదు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. దీనితో ఆచార్య విషయంలో చిరంజీవి కలుగుజేసుకున్నారనే కోణంలో కామెంట్ చేశాడా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇంతకు ముందు హీరోలతో హిట్ కొట్టడం.. తన కెరీర్‌లో ఆచార్య ఫ్లాప్ కావడంతో ఇలాంటి అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. దీనితో ఇన్నాళ్లు మాట్లాడని కొరటాల ఫైనల్ గా ఆచార్య ఫలితానికి కారణం చిరంజీవే అన్నట్టుగా సెలవిచ్చారు.

Koratala Siva నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

మరి ఏది ఏమైనప్పటికీ తప్పు ఎవరిది అయినప్పటికీ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి కలయికలో ఒక గుర్తుండిపోయే సినిమా చూడాలి అనుకునేవారికి మాత్రం ఒక దారుణమైన అనుభవమే మిగిల్చింది. అలాగే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కూడా ఘోరమైన నష్టాలే చూసారు. మరి ఈ ఆచార్య చిత్రం రాజమౌళి సెంటిమెంట్ తర్వాత వచ్చింది కాబట్టి ప్లాప్ అయ్యింది అని కొన్ని వదంతులు ఉన్నాయి. కాగా అది రామ్ చరణ్ వల్ల అయితే రాజమౌళితో చేసిన ఎన్టీఆర్ కూడా ఇదే కొరటాల శివతో “దేవర” అనే బిగ్ బడ్జెట్ సినిమాని చేసాడు. దీనితో ఈ భారీ సినిమా ఫలితం ఏమవుతుంది అని ఎదురు చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. దేవ‌ర చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది