Koratala Siva : దిమ్మతిరిగే కాంబినేషన్.. బాలకృష్ణ, మహేశ్ బాబులతో కొరటాల శివ మల్టీస్టారర్ మూవీ..!
Koratala Siva : టాలీవుడ్‌లో సినిమా మేకింగ్ ట్రెండ్ మారింది. మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ ప్రజెంట్ నడుస్తోంది. ఈ చిత్రాలకు డిమాండ్ కూడా బాగానే ఉంది. సీనియర్ హీరోస్‌తో పాటు యంగ్ హీరోస్ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఊహించని కాంబినేషన్స్ తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు హీరోలు మల్టీస్టారర్ ఫిల్మ్స్ చేశారు. కాగా, ఈ సారి స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు సై అంటున్నారు. ఈ క్రమంలోనే దిమ్మతిరిగే కాంబినేషన్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో వైరలవుతున్న న్యూస్ ప్రకారం.. నందమూరి బాలకృష్ణ- మహేశ్ బాబు కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ రాబోతుందని, దానిని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉన్న కొరటాల శివ..ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతున్నారు. కాగా, ఈ సినిమా అలా ఉండగానే మరో చిత్రానికి కొరటాల శివ ప్లాన్ చేశారట.
Koratala Siva : కొరటాల శివ దర్శకత్వంలో ఆ ఇద్దరూ హీరోలుగా.. ఇక రికార్డులు బద్ధలే..
గతంలో మహేశ్ బాబు-బాలకృష్ణ కాంబినేషన్ మూవీ కోసం అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు వార్తలొచ్చాయి. తాజాగా కొరటాల శివ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయబోతున్నారని న్యూస్. రెండు తరాల ఆడియన్స్‌ను కనెక్ట్ చేసే విధంగా ఇద్దరు హీరోల ఇమేజ్ మ్యాచ్ అయ్యేలా కొరటాల శివ స్టోరి రెడీ చేస్తున్నారట. ఒక్కసారి కాంబినేషన్ సెట్ అయిందంటే ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్తుందనే వార్తలొస్తున్నాయి.
అయితే, కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం చేసిన తర్వాత బాలకృష్ణ-మహేశ్ బాబు కాంబో మూవీ చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. చూడాలి మరి.. బాలకృష్ణ-మహేశ్ బాబు కాంబినేషన్‌పైన వస్తున్న వార్తల్లో నిజమెంత ఉందో.. ఈ విషయం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.