Jabardasth Naresh : మీ మొహాలకు అదొకటి తక్కువ.. వర్ష ఇమాన్యుయేల్ పరువుదీసిన జబర్దస్త్ నరేష్
Jabardasth Naresh బుల్లితెరపై షో వర్కవుట్ అవ్వాలంటే చేసే జిమ్మిక్కులు, టీఆర్పీ కోసం వేసే వేషాలు అందరికీ తెలిసిందే. ప్రేమలు,పెళ్లిళ్లు జరిపిస్తూ వేసే స్కిట్ల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏకంగా చీ కొడుతూ మల్లెమాలను ఏకిపారేస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఇలా బక్రాలను చేయాలని చూస్తుంటావ్..మారవా? అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. మొన్న శ్రీదేవీ డ్రామా కంపెనీలో వర్ష ఇమాన్యుయేల్ పెళ్లిపై జరిగినంత ట్రోల్ మరెప్పుడూ జరగలేదు.
Jabardasth Naresh వర్ష ఇమాన్యుయేల్ పరువుతీసిన జబర్దస్త్ నరేష్
అలా తమ షోలో జరిగిన పెంట గురించి జబర్దస్త్ నరేష్ తాజాగా నోరువిప్పాడు. తమ మీద జరిగిన ట్రోలింగ్ గురించి చెబుతూ వర్ష ఇమాన్యుయేల్ పరువుదీశాడు. తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో నరేష్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 25వ ఎపిసోడ్ సందర్భంగా లైలాను తీసుకొచ్చారు. ఆమె దగ్గరకు వచ్చిన ఇమాన్యుయేల్ మళ్లీ తన పెళ్లి ప్రస్థావనను తీసుకొచ్చాడు.
నాకు పెళ్లి చేస్తున్నారా? అని అడిగేశాడు. దీనిపై నరేష్ కౌంటర్ వేశాడు. మొన్న ఈ పెళ్లి చేసినందుకే సోషల్ మీడియాలో పెంట జరిగింది. తెలుగులో ఇన్ని బూతులు ఉన్నాయా? అని యూట్యూబ్‌లో కామెంట్లు చూశాకే తెలిసింది.. మీ మొహాలకు ఇంకా.. నీ చిత్రం చూసి నా చిత్తం అంటూ పాట ఒకటి అని ఆ ఇద్దరినీ ఏకిపారేశాడు. మొత్తానికి నరేష్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.