Kovai sarala : కోవై సరళ ఇన్నేళ్లయినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?
kovai sarala : సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా ఒక వెలుగు వెలుగుతున్నారు కోవై సరళ. ఆమె చేసిన ప్రతీ పాత్ర ఎంతగానో ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇండస్ట్రీకి కమెడియన్స్ ఎంతోమంది వస్తుంటారు. కానీ అందరికీ స్టార్ రేంజ్ లో క్రేజ్ రావడం కష్టం. ఇక ఎక్కువగా కమెడియన్స్ అంటే మేల్ ఆర్టిస్టులే ఫోకస్ అయ్యారు. అయితే లేడీ కమెడియన్స్‌లో బాగా పాపులర్ సాధించిన వాళ్ళలో చాలా తక్కువ మందిలో కోవై సరళకి సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆవిడ చేసే పాత్రలలో దాదాపు అన్నీ సక్సెస్ అయినవే.

kovai sarala behind the reason on Marrige
కోవై సరళ ఏ పాత్ర చేసినా ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అయితే వెండితెరపై కడుపుబ్బా నవ్వించే కోవై సరళ జీవితంలో కన్నీళ్లు, కష్టాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా ఆమె ఎందుకు ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోలేకపోయారనేది తెలిస్తే ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కుతుంది. కన్నీళ్ళు ఆపుకోలేరు. ప్రస్తుతం కోవై సరళ వయసు 59 సంవత్సరాలు. ఇన్నేళ్లయినా ఆమె పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు అనేది చాలామందికి తెలియదు. అందుకు కారణం ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడమే. తన నలుగురు చెల్లెళ్ళ జీవితాన్ని తానే చూసుకుంటున్నారు. వారికి పెళ్లిళ్లు చేసి పిల్లల బాధ్యత ఆవిడే తీసుకున్నారు.
kovai sarala : తన గురించి ఆలోచించుకునే సమయం ఉండటం లేదట.

kovai sarala behind the reason on Marrige
వాళ్ళ బాధ్యతతోనే తన జీవితం సరిపోతుంది. తన గురించి ఆలోచించుకునే సమయం ఉండటం లేదట. ముందు వాళ్ళు బావుంటే చాలు అనుకోవడమే కోవై సరళ గొప్పతనం. చెల్లెళ్ళ పిల్లలకు మంచి విద్యను అంధించి ఒక గొప్ప స్థాయికి తీసుకురావాడమే తన జీవిత లక్ష్యమని కోవై సరళ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదే తను పెళ్ళి చేసుకుంటే ఈ బాధ్యతను తీసుకోలేనని ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కారణంగానే తను పెళ్ళి చేసుకోకుండా తన జీవితాన్ని తన కుటుంబానికి అంకితం చేశారని అర్థమవుతోంది. ఇలాంటి త్యాగ మూర్తులు ఎంతమంది ఉంటారు.
kovai sarala : కామెడి కింగ్ బ్రహ్మానందం – కోవై సరళది హిట్ కాంబినేషన్.

kovai sarala behind the reason on Marrige
ఇక ఆమె ఇప్పటి వరకు 800 పై చిలుకు చిత్రాలలో నటించారు. భాష ఏదైనా తన స్టైల్ లో ఆకట్టుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఆమెకి పరాభవాలు ఎదురయ్యాయి. తన వాయిస్ బాగోలేదని కామెంట్ చేసిన వాళ్ళున్నారు. కానీ ఆ తర్వాత ఆ వాయిస్ కి ఫిదా అయిన వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఆమె నటించిన ప్రతీ భాషలలో సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. టాలీవుడ్‌లో కామెడి కింగ్ బ్రహ్మానందం కోవై సరళది హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్‌కి అభిమానులు చాలా మంది ఉన్నారు.
ఇది కూడా చదవండి ==> నడుమందాలతో చిచ్చెక్కిస్తున్న దేత్తడి హారిక.. వైరల్ ఫిక్స్..!
ఇది కూడా చదవండి ==> కత్తి మహేశ్ పోయాడని సంబరపడకండి.. రేపు మీ హీరో కూడా పోతాడు.. శ్రీరెడ్డి సంచలన పొస్ట్..!
ఇది కూడా చదవండి ==> బ్లాక్ బస్టర్ ఎవడు మూవీ ఏ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటబోయిన సిరి, శ్రీహాన్.. హేయ్ అంటూ అడ్డుకున్న యాంకర్ సుమ.. వైరల్ వీడియో !