Kathi mahesh కత్తి మహేష్ అందుకే చనిపోయాడా.. ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగింపుపై అనుమానాలు..!
Kathi mahesh : కత్తి మహేష్ Kathi mahesh ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి చెందిన కొన్ని గంటల తర్వాత వెలుగులోకి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అసలు ఏం జరిగింది..అనే కోణంలో ఆయన అభిమానులు ఆలోచించడం మొదలు పెట్టారట. సినీ, రాజకీయ విమర్శకుడు, దర్శకుడు, నటుడుగా కత్తి మహేష్ Kathi mahesh కి సినిమా ఇండస్ట్రీలో ఎంతటి పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. కాగా ఆయన మరణం అభిమానులకి, కొన్ని వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇక ఈ విషయం పట్ల మరికొందరిలో మిశ్రమ స్పందన కూడా వ్యక్తమవుతోంది.

kathi mahesh death mystery
రోడ్ యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ Kathi mahesh నెమ్మదిగా కోలుకొంటున్నారనే వార్త చాలా మంది సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల్లో సంతోషాన్ని కలిగించింది. ఇంతలోనే కత్తి మహేష్ చనిపోయాడనే వార్త షాకిచ్చింది. అనూహ్యంగా శనివారం మధ్యాహ్నం కత్తి మహేష్ ఇక లేరనే వార్త వచ్చింది. కాగా ఆయన మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం అవుతున్నాయట. యాక్సిడెంట్ తర్వాత మెరుగైన చికిత్స కోసం మహేష్ కత్తి Kathi maheshని చెన్నైకి తరలించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయనకు కంటికి, బ్రెయిన్, ముఖంపై తగిలిన గాయాలకు చికిత్స చేశారు. జూన్ 26 తేదీ నుంచి వెంటిలెటర్‌పైనే చికిత్స అందించారు. కొన్ని గంటల పాటు చేసిన చికిత్సల తర్వాత బ్రెయిన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, అలాగే రక్తస్రావం కూడా జరుగలేదనే విషయాలను వైద్యులు నిర్ధారించారు.

kathi mahesh death mystery
Kathi mahesh : మరణానికి ముందు వెంటిలేటర్ తొలగించారా..?
చెన్నైలోని అపోలోలో చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆయన ఊపిరితిత్తుల్లోకి రక్తం, నీరు చేరడంతో పరిస్థితి విషమంగా మారిందని వార్తలు ప్రసారం అయ్యాయి. ఆ సమస్యను గుర్తించి వైద్యులు తగిన వైద్యం చేయడానికి సిద్ధవుతున్న సమయంలో కత్తి మహేష్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయన మరణంపై సోషల్ మీడియాలోను, వెబ్ మీడియాలోను అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

kathi mahesh death mystery
తన మరణానికి ముందు వెంటిలేటర్ తొలగించారా.. ఆక్సిజన్ అందించడం ఆపేశారా..అనే విషయంలో చర్చలు సాగుతున్నాయి. దాంతో ఆయన సన్నిహితులు మరింత విషాదానికి గురవుతున్నారు. ఆక్సిజన్, వెంటిలెటర్ తొలగింపు విషయంపై వైద్యులు నివేదిక ఇస్తే గానీ అనుమానాలకు తెరపడదనే విషాయన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు విషయాలు ఎలా వెలుగులోకి రానున్నాయో చూడాలి.
ఇది కూడా చదవండి ==> బక్రాలను చేయాలనుకున్నావా?.. అషూరెడ్డిపై దారుణమైన ట్రోలింగ్
ఇది కూడా చదవండి ==> మీ మొహాలకు అదొకటి తక్కువ.. వర్ష ఇమాన్యుయేల్ పరువుదీసిన జబర్దస్త్ నరేష్
ఇది కూడా చదవండి ==> కోవై సరళ ఇన్నేళ్లయినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> నడుమందాలతో చిచ్చెక్కిస్తున్న దేత్తడి హారిక.. వైరల్ ఫిక్స్..!