Karthika Deepam : కార్తీకదీపంలో డాక్టర్ బాబుకు అలా చాన్స్ వచ్చిందా?.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..!
Karthika Deepam బుల్లితెరపై కార్తీకదీపం Karthika Deepam సీరియల్ క్రియేట్ చేస్తోన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత మూడేళ్ల నుంచి టాప్ రేటింగ్‌లను సాధిస్తూ దూసుకెళ్తోంది. అయితే గడిచిన వారం మాత్రం టీఆర్పీలో కాస్త వెనక్కి పడ్డట్టు లెక్కలు చెబుతున్నాయి. స్టోరీ మరీ సాగదీసినట్టు అనిపించడం, ఒకే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుండటంతో ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టినట్టు అనిపిస్తోంది. అయితే తాజాగా కార్తీకదీపం డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర కొన్ని సీక్రెట్స్ బయటపెట్టేశారు.

karthika deepam director k rajendra about nirupam
కార్తీకదీపం హీరో పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి Karthika Deepam
కార్తీకదీపం Karthika Deepam సీరియల్ అనుకున్నప్పుడు ఎవరిని? ఏ పాత్రలకు తీసుకోవాలని చాలా ఆలోచించారట. తర్జనభర్జనలు పడ్డారట. మొదటగా హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారట. ఇక్కడి అమ్మాయికి బ్లాక్ మేకప్ వేస్తే తెలిసిపోతోందని, అయినా అలా అస్సలు గుర్తు పట్టకూడదని, నిజంగానే అమ్మాయి నల్లగా ఉంటుందా? అని అనుకోవాలి.. అందుకే ప్రేమీ విశ్వనాథ్‌ను తీసుకున్నామని అన్నారు.

karthika deepam director k rajendra about nirupam
ఇక హీరో పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలో తెలియక నిరుపమ్ nirupam ను సలహా అడిగాం. ఆయన అప్పుడు చాలా బిజీగా ఉండేవారు. ఆయన్ను అలా సలహా అడగడంతో ఎంతో మంది పేర్లు చెప్పారు. కానీ ఏ ఒక్కరూ కూడా సెట్ కాలేదు. చివరకు మీరే చేయండి అని అడగడంతో నిరుపమ్ ఒప్పుకున్నారట. అలా కెరీర్ టర్నింగ్ పాత్ర ఆయన ఖాతాలో పడ్డట్టు అయింది. ఇప్పుడు నిరుపమ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ డాక్టర్ బాబు.
ఇది కూడా చదవండి ==> మీ మొహాలకు అదొకటి తక్కువ.. వర్ష ఇమాన్యుయేల్ పరువుదీసిన జబర్దస్త్ నరేష్
ఇది కూడా చదవండి ==> కోవై సరళ ఇన్నేళ్లయినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> నడుమందాలతో చిచ్చెక్కిస్తున్న దేత్తడి హారిక.. వైరల్ ఫిక్స్..!
ఇది కూడా చదవండి ==> కత్తి మహేశ్ పోయాడని సంబరపడకండి.. రేపు మీ హీరో కూడా పోతాడు.. శ్రీరెడ్డి సంచలన పొస్ట్..!