Kota Srinivasarao : ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరో అతనే .. సైలెంట్ గా చిచ్చు పెట్టిన కోట శ్రీనివాసరావు !

Authored By aruna | The Telugu News | Published on: June 8, 2023, 8:00 pm

Kota Srinivasarao  : టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ స్టార్ హీరో పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ వేరు అని చెప్పవచ్చు. కేవలం సినీ అభిమానులే, జనాలే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో తారక్ అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు కోట శ్రీనివాసరావు. రీసెంట్గా ఆయన ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.

ఈ జనరేషన్లో ఈ ఇండస్ట్రీకి అవసరమయ్యే హీరోలలో ఉండాల్సిన క్వాలిటీస్ అని కూడా ఎన్టీఆర్లో ఉన్నాయని, తాతకు తగ్గ మనవడు అని భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అంటూ ఓపెన్ గా చెప్పకొచ్చారు. అంతేకాదు ఈ జనరేషన్ హీరోలలో పెద్దగా ఆయనకి ఎవరు నచ్చరని, తారక్, మహేష్ బాబు, బన్నీ అంటే చాలా ఇష్టమని, వాళ్లలో నటించే స్కిల్స్ బాగుంటాయని చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే మిగతా హీరోల అభిమానులు మా హీరోలు కూడా నెంబర్ వన్ అంటూ ట్రెండు చేస్తున్నారు.

Kota Srinivasarao serious comments about that star hero

Kota Srinivasarao serious comments about that star hero

ఇక ప్రస్తుతం కోట శ్రీనివాసరావు కు వయస్సు పై పడటంతో సినిమాలలో ఎక్కువగా నటించడం లేదు. ఇక ఆయన ఎన్నో సినిమాలలో విలన్ గా, హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించారు. అలాగే హీరోలకు తాత పాత్రలలో కూడా నటించారు. ఆయన అన్ని సినిమాలలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ కి చర్చ జరుగుతుంది. కేవలం కోట శ్రీనివాసరావు మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

aruna

No bio available for this author.

  1. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  2. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  3. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  4. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  5. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  6. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  7. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp