Kota Srinivas Rao : రెమ్యూనరేషన్ విషయంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కాంట్రవర్సీ కామెంట్స్ వీడియో వైరల్..!!
Kota Srinivas Rao : సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అందరికీ సుపరిచితుడే. రెండో వైవిధ్యమైన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి గుర్తింపు సంపాదించుకోవడం జరిగింది. ఒకప్పుడు కోటా శ్రీనివాసరావు లేని సినిమా లేదు. విలన్ గా… హీరో తండ్రిగా ఇంకా అనేక పాత్రలలో.. నటించిన వ్యక్తి. అయితే ఇటీవల వయసు మీద పడటంతో… అడపా గడప వేషాలు వేస్తూ కొన్ని సినిమాలలో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. కానీ కొన్ని వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ… వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
తాజాగా హీరోల రెమ్యూనరేషన్ గురించి కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కాంట్రవర్సీగా మారాయి. ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు రామారావు లేదా నాగేశ్వరరావు ఆ తరం హీరోలు.. ఎవరూ కూడా రోజుకి తాము ఇంత తీసుకున్నట్టు బహిరంగంగా కామెంట్లు చేసిన సందర్భాలు లేవు. కానీ ప్రస్తుత రోజుల్లో ఉన్న హీరోలు తమ రోజుకి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నామని బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు ఇది మంచి సందర్భం కాదు. ఈ విషయంలో మా అసోసియేషన్ సభ్యులు ఆర్టిస్టులు రోజుకి ఎంత సంపాదిస్తున్నారు
అనేది పరిగణలోకి తీసుకోకుండా రెండు పూటలా కడుపునిండా భోజనం చేస్తున్నారా లేదా అనేది పట్టించుకోవాలి. ఇదే విషయంలో ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ పట్ల చొరవ తీసుకొని కొన్ని రాయితీలు కల్పించాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ ఎక్కడ జరిగిన… సదరు సినిమాకి రాయితీలతో పాటుగా సినిమా ఆర్టిస్టులకి మేలుకరమైన ప్రయోజనాలు చేకూరేలా.. సహకారం అందించాలని ఈ విషయంలో మా అసోసియేషన్ పెద్ద పాత్ర పోషించాలని కోట శ్రీనివాసరావు సూచనలు చేశారు.
