Jabardasth : జబర్దస్త్ కొత్త జడ్జ్‌లుగా కృష్ణ భగవాన్, పోసాని కృష్ణ మురళి… ఇద్దరిలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్?
Jabardasth : నాగబాబు, రోజాలతో ప్రారంభం అయినా జబర్దస్త్ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యి పది సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఒక కామెడీ షో ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్ గా కొనసాగడం అనేది రికార్డు. జబర్దస్త్ జడ్జ్ గా నాగబాబు మరియు రోజా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. నాగబాబు మల్లెమాల వారితో వచ్చిన విభేదాల కారణంగా ఆ మధ్య తప్పుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే మంత్రి పదవి వచ్చిన కారణంగా రోజా తప్పుకుంది. వారిద్దరూ పోయినప్పటి నుండి జబర్దస్త్ జడ్జ్ స్థానంలో ఎవరు వచ్చి కూర్చుంటున్నారో అర్థం కావడం లేదు. మనో, ఇంద్రజ, కుష్బూ, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణ మురళి ఇలా ఎంతో మంది ఆ జబర్దస్త్ జడ్జ్ ప్లేస్ లో కూర్చుని వెళుతున్నారు. పర్మినెంట్ జడ్జ్ ఏ ఒక్కరు కనిపించడం లేదు.
ఇంద్రజ ని ఆ మధ్య పర్మినెంట్ జడ్జ్ అన్నట్లుగానే అనిపించినా కూడా ఆమె రెగ్యులర్ గా కనిపించడం లేదు. గెస్ట్ జడ్జ్ గా మాత్రమే ఆమె జడ్జ్ సీట్లో కూర్చుంటుంది. జబర్దస్త్ కి తాజాగా పోసాని కృష్ణ మురళి మరియు కృష్ణ భగవాన్ లు జడ్జి లుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ టాలీవుడ్ లో సీనియర్ స్టార్ కమెడియన్స్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ ఆ ప్లేస్ కి న్యాయం చేయగలరు, అయితే వీరిద్దరికి స్టార్ డం ఇప్పుడు ఏమాత్రం లేదు. ఈ సమయం లో వీరిని జబర్దస్త్ జడ్జ్ సీట్లో కూర్చో పెట్టడం అనేది షో కి డ్యామేజీ అవుతుంది.. తప్పితే ప్లస్ అవ్వదు అంటూ కొందరు జబర్దస్త్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయం పక్కన బెడితే వీరిద్దరికీ ఇచ్చే పారితోషకం ఎంత అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక షెడ్యూల్ కి గాను ఇద్దరికీ సమానమైన రెమ్యూనరేషన్ ని మల్లెమాల వారు ఇస్తున్నారట. అది ఎంత అనేది క్లారిటీ లేదు. కానీ లక్ష నుండి లక్షన్నర వరకు ఉంటుంది అనేది మాత్రం తెలుస్తోంది. ఒకప్పుడు వరుసగా సినిమా లు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఈ స్టార్ కమెడియన్స్ ఇప్పుడు పెద్దగా ఆఫర్స్ లేక పోవడంతో కాస్త తక్కువ రెమ్యూనరేషన్ అయినా కూడా పరవాలేదు అన్నట్లుగా జబర్దస్త్ జడ్జ్ సీట్లో కూర్చునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కృష్ణ భగవాన్ మరియు పోసాని కృష్ణ మురళి ఇద్దరు కూడా జబర్దస్త్ జడ్జి స్థానం లో పర్మినెంట్ కానే కాదు అనేది మల్లెమాల వారి నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం మల్లెమాల ఈటీవీ వారు జబర్దస్త్ కోసం ఇద్దరు పర్మినెంట్ జడ్జ్ లను వెతికే పనిలో ఉన్నారు.