Ramya Krishnan : రమ్య కృష్ణతో కృష్ణ వంశీకి విభేదాలా.. పెళ్లి చేసుకోకూడదని చెప్పడం వెనక మతలబు ఏంటి?
Krishna Vamshi : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో కృష్ణ వంశీ ఒకరు. ఆయన సినిమాలు ఒకప్పుడు ప్రేక్షకులని ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం.. వంటి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడు 2017లో నక్షత్రం అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత ఈయన మరో సినిమాను తెరకెక్కించలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ సినిమా మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్. ఆగస్ట్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో ఆయన భార్య రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తుండగా, ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా వ్యక్తిగత జీవితంలో రమ్యకృష్ణతో పెళ్లి ..వివాదాలంటూ వచ్చిన వార్తలు సహా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నేను పెళ్లికి కంఫర్ట్‌గా కానేమోనని భావించాను. ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. అలాగని ఏకాకిలా కాదు. రాత్రి సమయంలో సినిమాలు చూస్తుంటాను. పగలు ఏదైనా పుస్తకం చదువుతుంటాను. మాట్లాడటానికి కూడా ఎక్కువ ఇష్టపడను. బాధ్యతలంటే భయం. ఫ్రీ సోల్‌గా ఉండాలని అనుకున్నాను. కానీ చివరకు రమ్యకృష్ణతో పెళ్లి జరిగింది.

krishna vamsi open up about Ramya Krishnan issues
Ramya Krishnan : కృష్ణవంశీ క్లారిటీ..
అదంతా లైఫ్ డిజైన్ అనే ఇప్పటికీ భావిస్తాను. రమ్యకృష్ణతో పెళ్లి తర్వాత నా జీవితం ఏమి మారలేదు. అంతా హ్యపీగా ఉంది. మా ఇద్దరిలోనూ పిల్లాడు పుట్టడం మినహా విపరీతమైన మార్పులేమీ రాలేదు.రమ్యకృష్ణతో గొడవలు అయ్యాననే విషయంపై రియాక్ట్ అవుతూ..‘‘సెలబ్రిటీలు అయినప్పుడు కొన్నింటిని ఫేస్ చేయక తప్పదు. ఎవరో ఒక్కరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు. అలాంటి వార్తలు గురించి విన్నప్పుడు ఓకే మాట్లాడుకోని అని నవ్వుకుంటాం. అందుకనే గాసిప్స్‌ను ఎప్పుడూ ఖండించాలని అనిపించలేదు. ఫీల్ కాలేదు.. అలా కూడా మాట్లాడుకుంటున్నారా! అని కూడా అనుకుంటాం’’ అని అన్నారు.