Ramya Krishna : నరసింహ సినిమా లో సౌందర్య మొహం మీద రమ్య కృష్ణ కాలు పెట్టే సీన్ లో సెట్స్ లో ఏం జరిగింది అంటే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ramya Krishna : నరసింహ సినిమా లో సౌందర్య మొహం మీద రమ్య కృష్ణ కాలు పెట్టే సీన్ లో సెట్స్ లో ఏం జరిగింది అంటే !

 Authored By aruna | The Telugu News | Updated on :12 July 2023,8:20 pm

Ramya Krishna : దివంగత నటి సౌందర్యను ఇప్పటికి ఇష్టపడే అభిమానులు చాలామంది ఉన్నారు. తన అందం, నటనతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచారు. ఆమె కనుక మరణించకపోతే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసేవారో అని అభిమానులు తలుచుకుంటూ ఉంటారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో సౌందర్య గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఏ ఒక్క సినిమాలో కూడా సౌందర్య మితిమీరి హద్దులు దాటలేదు. ఇండస్ట్రీలో ఎదగడానికి చాలామంది కొంచెం గ్లామర్ ను చూపిస్తూ ఉంటారు కానీ సౌందర్య మాత్రం ఎప్పుడూ అలా చేయలేదు.

ఈమెకు భిన్నంగా రమ్యకృష్ణ మాత్రం అన్ని విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ్లామర్ పాత్రలో కూడా ఏమాత్రం తగ్గకుండా నటించేవారు. వీళ్ళిద్దరూ కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘ నరసింహ ‘ సినిమాలో నటించారు. అయితే ఇందులో సౌందర్యది సాఫ్ట్ గా ఉండే పాత్ర, రమ్యకృష్ణది ప్రతికూల పాత్ర. ఈ సినిమాతోనే రమ్యకృష్ణ విలన్ గా ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ సినిమాలో ఒక సీన్ లో రమ్యకృష్ణ కాలుని సౌందర్య పట్టుకోవాల్సి వస్తుంది. ఈ సీన్ ముందుగా రమ్యకృష్ణకు చెప్పగా ఆమె కాస్త కంగారు పడ్డారట.

Ramya Krishna stepped on Soundarya's face in Narasimha movie

Ramya Krishna stepped on Soundarya’s face in Narasimha movie

సౌందర్య అప్పటికే స్టార్ హీరోయిన్. అలాంటిది ఆమెపై కాలు పెట్టడం ఏంటి అని అన్నారు. అయితే అక్కడే ఉన్న సౌందర్య రమ్యకృష్ణ కాలు తీసుకొని తన భుజాన వేసుకొని మసాజ్ చేసిందట. దీంతో ఒక్క టేకులోనే ఈ సీన్ చేశారు. తర్వాత ఈ సీన్ పై చాలా విమర్శలు వచ్చాయి. ఈ సీన్ తీసేయాలని సౌందర్య అభిమానులు కోరారు. మరికొందరు అక్కడ ఉన్నది సౌందర్య కాదని డూప్ పెట్టారని చెప్పుకొచ్చారు. అయితే వీటికి డైరెక్టర్ కెఎస్ రవికుమార్ స్పందిస్తూ ఈ సీన్ అక్కడ తప్పకుండా అవసరం. అందుకే చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇక సౌందర్యకు డూప్ గా ఎవరూ నటించలేదని, ఆమెనే ఇలా చేసిందని చెప్పుకొచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది