Krishnam Raju : రెబల్ స్టార్ కృష్ణం రాజు చనిపోవడానికి కారణాలు ఇవా?.. షాక్‌లో సినీ ప్రియులు
Krishnam Raju : కొన్ని దశాబ్ధాల పాటు తెలుగు ప్రేక్షకులని అలరించిన నటుడు కృష్ణం రాజు. హీరోగా నటించి ఆ తర్వాత విలన్‌గాను నటించి మెప్పించారు. అయితే చివరిగా రాధే శ్యామ్ చిత్రంలో కనిపించి మెప్పించిన కృష్ణం రాజు ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పోస్ట్ కోవిడ్ తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ క్రమంలో కృష్ణం రాజు పలు మార్లు ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. కాని ఈ రోజు కృష్ణం రాజు కన్నుమూసారు.అతని మరణంపై ఏఐజీ ఆసుపత్రి స్పందించింది. డయాబెటిస్, కరోనరీ హార్ట్ డీసీజ్ తో కృష్ణం రాజు ఇబ్బందిపడిట్టు తెలిపారు వైద్యులు.
Krishnam Raju : కారణాలు ఇవే..
కృష్ణం రాజు గుండె కొట్టుకునే సమస్యతో చాలా కాలంగా ఇబ్బందిపడుతున్నారని, రక్త ప్రసరణలో సమస్యతో గతేడాది కాలుకి శాస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఇక దీర్ఘ కాలిక కిడ్నీ , ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న కృష్ణం రాజు..పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5 వ తేదీన ఆసుపత్రిలో చేరారు. మల్టి డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యూమోనియా కూడా ఏర్పడిందని వైద్యులు తెలిపారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు అయితే ఉదయం గుండెపోటు రావడంతో కృష్ణం రాజు మృతి చెందినట్టు వెల్లడించారు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు.
కృష్ణంరాజుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నత కుటుంబంలో పుట్టారు. చదువు పూర్తి కాగానే జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు.ఆ తర్వాత నటుడిగా తన ప్రయాణం సాగించి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. తొలి భార్య సీతాదేవి కన్నుమూయడంతో, 1996లో శ్యామలా దేవిని వివాహం చేసుకున్నారు. దాదాపు 200 సినిమాల్లో నటించిన అనుభవం కృష్ణంరాజు సొంతం. చిలకా గోరింక అనే చిత్రంతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు కృష్ణంరాజు. అమరదీపం, భక్త కన్నప్ప వంటి సొంత చిత్రాలు గొప్ప నటుడిగా పేరు తెచ్చిపెట్టాయి.