Krithi Shetty : బ్యూటిఫుల్ భామ కృతిశెట్టి ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘ఉప్పెన’ ఫిల్మ్ తర్వాత ఈ భామ సెన్సేషనల్ హీరోయిన్ అయింది. కుర్రకారు గుండెల్లో ‘బేబమ్మ’గా తనదైన ముద్ర వేసుకున్న ఈ సుందరి.. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ చిత్రాల్లోనూ ఈ భామ కథానాయికగా నటించింది. ఈ సంగతులు అలా ఉంచితే.. తాను సినిమాల్లో నటించాలంటే పలు కండీషన్స్ పెట్టుకుందట ఈ సుందరి.మూవీస్‌లోనే కాకుండా బయట కూడా కృతిశెట్టి తన వేసుకునే బట్టలపైన శ్రద్ధ వహిస్తోంది. కట్టు, బొట్టులకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంటున్నది.
అందం అంటే ఆరబోత మాత్రమే కాదని చెప్పకనే చెప్తోంది. అలా ఎక్స్ పోజింగ్ కు కాస్త దూరంలోనే ఉంటోంది ఈ అమ్మడు. ఇకపోతే తాను సినిమాలు చేయాలంటే తనకు తానుగా కొన్ని బౌండరీస్ పెట్టుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది. అవేంటంటే..సినిమా చేయబోయే ముందర తనకు పాత్ర, కాస్ట్యూమ్స్ కంఫర్ట్ గా ఉండాలని చెప్తానని పేర్కొంది కృతిశెట్టి. అలా అన్ని విషయాలపైన క్లియర్ కట్ గా ఫైనల్ అయిన తర్వాతనే తాను చిత్రంలో నటిస్తానని తెలిపింది.
తన కంఫర్ట్స్, కాస్ట్యూమ్స్, క్యారెక్టర్స్ అన్ని నచ్చిన తర్వాతనే ఆ ఫిల్మ్ లో తాను భాగం అవుతానని చెప్పిది ‘ఉప్పెన’ భామ. ఇకపోతే తాను, తన అమ్మతో కలిసి కథలు వింటానని తెలిపిన కృతిశెట్టి.. తనను తన అమ్మ, మామయ్య గైడ్ చేస్తారని చెప్పింది. తాను ఇప్పటి వరకు బోల్డ్ క్యారెక్టర్స్ ప్లే చేయలేదని, అయితే, అటువంటి క్యారెక్టర్స్ తనకు అన్ కంఫర్టబుల్ గా ఉంటాయని, అందుకే చేయలేదని చెప్పింది కృతిశెట్టి. తాను ఒక స్క్రిప్ట్ విన్న తర్వాత పాత్రకు సంబంధించి ఏం చేయాలనేది ఆలోచిస్తానని, అలా ఇంటి లోపల హోం వర్క్ చేస్తానని, అలా చేసిన తర్వాతనే తాను సినిమా చేస్తానని వివరిస్తోంది కృతిశెట్టి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.