Krithi Shetty : ‘ కొంచెం చూపించు ‘ అంటే కృతి శెట్టి అంత డబ్బు అడిగిందా ? వామ్మో నాయనో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krithi Shetty : ‘ కొంచెం చూపించు ‘ అంటే కృతి శెట్టి అంత డబ్బు అడిగిందా ? వామ్మో నాయనో !

 Authored By prabhas | The Telugu News | Updated on :18 April 2023,1:00 pm

Krithi Shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఉప్పెనలా ఎగిసింది అందాల బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో వరుసగా ఆమెకు సినీ ఆఫర్లు వస్తున్నాయి. ఉప్పెన తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా ఆమెకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇన్నాళ్లు చీరలు, చుడీదార్లు, స్కర్ట్ లు, మిడ్డీల్లో కనిపించిన కృతి శెట్టి ఈసారి బికినీలో దర్శనం ఇవ్వబోతుంది. అది కూడా టూ పీస్ బికినీ చిట్టి పొట్టి బట్టల్లో కృతి శెట్టిని చూస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు అభిమానులు.

krithi Shetty highest remuneration for that movie

krithi Shetty highest remuneration for that movie

త్వరలోనే కృతి శెట్టి కస్టడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అలాగే కోలీవుడ్లో కార్తీతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయింది. అంతేకాదు రీసెంట్గా మరో సినిమాకి కూడా కమిట్ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ఏకంగా ఐదు కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బికినీ వేసుకొని నటిస్తున్నందుకు కృతి శెట్టి కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందట. తను బికినీ వేసుకున్నప్పుడు అక్కడ ఎవరూ ఉండకూడదని, టెక్నీషియన్స్ కూడా ఎవరు ఉండకూడదని, కేవలం దర్శకుడు, కెమెరామెన్ మాత్రమే ఉండాలని కృతి కండిషన్స్ పెట్టిందట.

video story | Krithi Shetty Mind Blowing Looks @ Her Latest Ad Shoot Video  | Tupaki | Tupaki Telugu

అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన హీరో కూడా అక్కడ ఉండకూడదని, రెండు మూడు నిమిషాలు మాత్రమే బికిని వేసుకుంటానని అంతకుమించి వేయను అని, ఆ ఫొటోస్ కూడా తను చూసిన తర్వాతే మీడియాకు రిలీజ్ చేయాలి అని, ప్రతిసారి తన బికినీ ఫొటోస్ ను ప్రమోషన్స్ కోసం వాడకూడదు అంటూ కండిషన్స్ పెట్టిందట. అన్ని కండిషన్స్ పెడుతూ కృతిశెట్టి ఐదుకోట్ల రెమ్యూనరేషన్ అడిగిందట. దీంతో దర్శక నిర్మాతలు షాక్ అయిపోతున్నారట. అయినా ఆమెకు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ కారణంగా దర్శక నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది