Krithi Shetty : బేబమ్మా ఏందిది.. రొమాన్స్‌లో రెచ్చిపోతున్న కృతిశెట్టి..!

 Authored By mallesh | The Telugu News | Updated on :16 December 2021,4:20 pm

Krithi Shetty : ముంబై భామ కృతిశెట్టి… ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన ఈ సుందరి.. అప్పుడే వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది కృతి..నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్‌లో కృతిశెట్టి నాని సరసన నటించింది. అయితే, ఈ సినిమాలో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది ఈ భామ. నానితో లిప్ లాక్ సీన్ చేసింది. ట్రైలర్‌ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

ఒకే ఒక్క సినిమా తర్వాత కృతిశెట్టి ఇలా చేసిందేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, పాత్ర ప్రాధాన్యతను బట్టి కృతిశెట్టి అలా చేసి ఉంటుందని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ సినిమాలో కృతి పాత్ర అత్యద్భుతంగా ఉండబోతున్నదని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతుంది. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో రెండు అత్యద్భుతమైన పాటలను దివంగత లిరిసిస్ట్ పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు. కృతిశెట్టి ప్రస్తుతం లింగుస్వామి-రామ్ పోతినేని డైరెక్షన్‌లో వస్తున్న సినిమాతో పాటు యూత్ స్టార్ నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’,

krithi shetty lip lock scene video viral in social media

krithi shetty lip lock scene video viral in social media

Krithi Shetty : ఒక్క సినిమాతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న కృతి..

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. రెండో సినిమాకు కృతిశెట్టి అలా హద్దులు చెరిపేసుకోవడమేంటని పలువురు అనుకుంటున్నారు. అయితే, సినమా పాత్ర ప్రకారం చేసి ఉంటుందనే అభిప్రాయం కూడా పలువురు అంటుండగా, అదే మెజారిటీ వాదనగా కనబడుతోంది. ఈ భామ ఇలానే కొనసాగితే అతి తక్కువ టైంలో తన స్టార్ డమ్‌ను ఇంకా పెంచేసుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సాయిపల్లవితో పాటు మడోనా సెబాస్టియన్, కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రాన్ని వెంటక్ బోయినపల్లి ప్రొడ్యూస్ చేశారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి