Krithi Shetty : బేబమ్మ ర‌చ్చ ఏంది.. ర‌ష్మిక మందన్న వ‌ద్ద‌న్న‌ది కృతి శెట్టి కావాలంటుంది ఎందుకు?

Advertisement

Krithi Shetty : కృతి శెట్టి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఉప్పెన సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుంది. మొదటి సినిమాతోనే సూప్ డూపర్ హిట్ కొట్టి.. వరుసగా హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన తో మొదలు పెట్టి వరుసగా శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ యంగ్ స్టార్ హీరోయిన్ కు పట్టుమని 19 ఏళ్లు ఉన్నాయంతే. ఇంత చిన్న వయస్సులోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది కృతి శెట్టి. రీసెంట్‌గా కృతి న‌టించిన ది వారియర్ సినిమా ఫ్లాప్ అయినా..అమ్మడి క్రేజ్ మాత్రం..సూపర్ గా ఉంది.

Advertisement

Krithi Shetty : కృతి రీప్లేస్‌మెంట్..

తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ..టాప్ ప్లేస్ లో ఉంది. ప్రజెంట్ అమ్మడు నటించిన మాచర్ల నియోజకవర్గం..రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో మరోసారి తన లక్ ను పరీక్షించుకోబోతుంది కృతిశెట్టి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ప్ర‌మోష‌న్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. నాకు వర్క్ అంటే ఇష్టం. వర్క్ లేకపోతేనే రాంగ్ అనిపిస్తుంది. ఎప్పుడు షూటింగ్ కి వెళ్దామా అనిపిస్తుంటుంది. కథ విన్నప్పుడే ఒక నమ్మకం వస్తుంది. సినిమా ప్రేక్షకులకు వినోదం పంచుతుందనిపిస్తుంది. అలా అనుకునే చేస్తాను. ఫలితంపై నాకు ఎలాంటి రిగ్రేట్ వుండదు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్ పిరియన్స్ గానే తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది.

Advertisement
Krithi Shetty replaced by Rashmika Mandanna
Krithi Shetty replaced by Rashmika Mandanna

అయితే ఫ‌స్ట్ టైం నితిన్ మూవీ ఛాన్స్ ర‌ష్మిక‌కి వ‌చ్చింద‌ట‌. కానీ ఈ అమ్మడు బిజీ గా ఉండి కాల్ షీట్లు ఖాళ్లీ లేక ఈ సినిమా ను వదులుకుందట. కానీ, ఇండస్ట్రీ టాక్ ప్రకారం భీష్మ సినిమా టైంలో నితిన్ కు, రష్మికకు చెడింద‌ని, ఆ కారణం చేతనే..రష్మిక ఈ సినిమాను వదులుకుందట. దీంతో ఆ అవకాశాని బేబమ్మ అందుకుందని టాక్ వైరల్ గా మారింది. మ‌రి కృతి ఈ సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకుంటుందా లేదా అనేది చూడాలి. కాగా, మాచర్ల నియోజకవర్గం’లో నా పాత్ర పేరు స్వాతి. సింపుల్ అండ్ ఇన్నోసెంట్. అలాగే స్వాతి పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. సీన్ ని బట్టి ఒక్కో షేడ్ బయటికి వస్తుంది. నా పాత్ర చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుంది అని రీసెంట్‌గా కృతి చెప్పింది.

Advertisement
Advertisement