Krithi Shetty : పెళ్లైన హీరోపై ఇష్టాన్ని పెంచుకున్న కృతి శెట్టి.. ఈ ప‌ద్ద‌తి బాగోలేదంటున్న నెటిజన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krithi Shetty : పెళ్లైన హీరోపై ఇష్టాన్ని పెంచుకున్న కృతి శెట్టి.. ఈ ప‌ద్ద‌తి బాగోలేదంటున్న నెటిజన్స్

Krithi Shetty : ఒక్క‌సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమాలోనే త‌న అంద‌చందాల‌తో పాటు న‌ట‌న‌తోను ఎంతగానో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటూ, హిట్స్ అందుకుంటుంది. రీసెంట్‌గా కృతి శెట్టి న‌టించిన శ్యామ్ సింగ్ రాయ్ హిట్టైంది. ఆ త‌ర్వాత విడుద‌లైన బంగార్రాజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తుండ‌డంతో.. కృతీ హ్యాట్రిక్ విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ సుధీర్ బాబుకు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :20 January 2022,6:30 pm

Krithi Shetty : ఒక్క‌సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమాలోనే త‌న అంద‌చందాల‌తో పాటు న‌ట‌న‌తోను ఎంతగానో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటూ, హిట్స్ అందుకుంటుంది. రీసెంట్‌గా కృతి శెట్టి న‌టించిన శ్యామ్ సింగ్ రాయ్ హిట్టైంది. ఆ త‌ర్వాత విడుద‌లైన బంగార్రాజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తుండ‌డంతో.. కృతీ హ్యాట్రిక్ విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ సుధీర్ బాబుకు జోడీగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్ స‌ర‌స‌న `మాచర్ల నియోజకవర్గం`, రామ్‌తో `ది వారియర్` చిత్రాలు చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.

ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.తన తొలి సినిమా ఉప్పెన సక్సెస్ ఎంతో ఆనందాన్నిచ్చిందని .. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రశంస ఎన్నటికీ మర్చిపోలేదని చెప్పుకొచ్చింది. ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన గురించి చిరంజీవి గారు మాట్లాడడం పెద్ద బహుమతిగా అనిపించిందని.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ ఆయనొక గిఫ్ట పంపించారని తెలిపింది. తన చేతితో రాసిన ఓ లెటర్ , గిఫ్ట్ చిరంజీవి గారు పంపించారని… అందులో యూ ఆర్ ఏ బోర్న్ స్టార్ అని రాశారని… అందుకే ఆ లెటర్ ను ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకున్నానని తెలిపింది.

krithi shetty shows her love on ram charan

krithi shetty shows her love on ram charan

Krithi Shetty : కృతి కోరిక‌లు మాములుగా లేవు..!

ఇక రంగ‌స్థలం చిత్రంలో చిట్టిబాబుగా అల‌రించిన రామ్ చ‌ర‌ణ్ ఆ సినిమాతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందడ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు. అయితే ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ .. కృతి శెట్టి మ‌న‌సు కూడా గెలుచుకున్నాడ‌ట‌. రీసెంట్‌గా కృతిని ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నావు అని అడుగగా… నాకు రామ్‌ చరణ్‌ గారంటే చాలా ఇష్టం. తెలుగులో నేను చూసిన తొలి చిత్రం ‘రంగస్థలం’. హిందీలో ఆయన డబ్బింగ్‌ సినిమాలు చూశాను. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ నాకు చాలా బాగా నచ్చారు. ఆయనతో కలిసి పనిచేయాలని ఉంది. ఎప్పటికైనా రామ్ చరణ్ గారితో కలిసి పని చేయాలి” అని తెలిపింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది