Kingdom : విజయ్ దేవరకొండ సినిమాకి కేటీఆర్ కొడుకు రివ్యూ.. సినిమా చాలా నచ్చింది అంటూ కామెంట్
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు. సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో, మూవీపై హైప్ మరింత పెరిగింది.
Kingdom : పాజిటివ్ రివ్యూ…
అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, విజయ్ దేవరకొండ నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత విజయ్ నుండి వచ్చిన సాలిడ్ కంబ్యాక్ మూవీగా ‘కింగ్‌డమ్’ నిలుస్తుందని ప్రేక్షకులు పేర్కొంటున్నారు.తాజాగా ఈ సినిమా చూసిన మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు, తన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “RTC X రోడ్స్‌లో నా ఇద్దరు స్నేహితులతో కలిసి ‘కింగ్‌డమ్’ చూశాను. థియేటర్‌లో చూసిన అనుభూతి చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.

Kingdom : విజయ్ దేవరకొండ సినిమాకి కేటీఆర్ కొడుకు రివ్యూ.. సినిమా చాలా నచ్చింది అంటూ కామెంట్
బిగ్ స్క్రీన్, ప్రేక్షకుల హైప్ మధ్య కింగ్‌డమ్ వైబ్ నిజంగా గూస్‌బంప్స్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. సినిమా నాకెంతో నచ్చింది” అంటూ హిమాన్షు ట్వీట్ చేశారు.
హిమాన్షు చేసిన ట్వీట్‌కు విజయ్ దేవరకొండ కూడా హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఇక కొద్దిసేపటి క్రితం విజయ్ దేవరకొండ స్వయంగా ట్విట్టర్ వేదికగా తన భావాలు పంచుకున్నాడు. ప్రస్తుతం నాకు ఎలా అనిపిస్తుందో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా అదే ఫీలింగ్ అనుభవిస్తారని ఆశించాను. వెంకన్న స్వామి దయ, మీ అందరి ప్రేమ… నాకు ఇంకేం కావాలి!” అంటూ భావోద్వేగ ట్వీట్ చేశాడు.