Lahari Shari: పవన్‌తో ఉన్న రిలేషన్ పై బిగ్ బాస్ లహరి షాకింగ్ విషయాలు వెల్లడి సోషల్ మీడియాలో వైరల్
Lahari Shari: రీసెంట్‌గా కారు యాక్సిడెంట్‌లో మరణించిన కత్తి మహేష్‌కి విమర్శకుడిగా ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై మహేష్ చేసిన విమర్శలు ఎన్ని గొడవలకు కారణం అయ్యాయో తెలిసిందే. దీనిలో భాగంగా అప్పుడు ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో కత్తి మహేష్ గట్టి షాక్ ఇచ్చింది యాంకర్ లహరి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేస్తున్న కత్తి మహేష్‌ని, మీ తల్లిగారి పేరేంటి? అని అడిగింది.

lahari shari relationship with pawan Kalyan
లహరి ఎన్నిసార్లు అడిగినా కానీ కత్తి మహేష్ తన తల్లి గురించి చెప్పకుండా, ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. ఈ ఇంటర్వ్యూ ఆ సమయంలో పెద్ద సంచలనం అయింది కూడా. ఈ ఇంటర్వ్యూ చేసిన లహరి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్. ఆ ఒక్క ఇంటర్వ్యూతో లహరి సెలబ్రిటీ అయిందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ యాంకర్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. అదే సందర్భంలో లహరి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కవరేజ్‌కి వెళ్లడం.. బైక్ మీద జనసేన జెండా పెట్టుకుని చక్కర్లు కొట్టడం.. పవన్ కళ్యాణ్‌ని పర్సనల్‌గా కలిసి ఫొటోలు దిగడంతో పలు రకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
Lahari Shari: అందుకే ఆయన మాటల్ని తీవ్రంగా ఖండించాను.
ఇటీవల లహరి వీటికి స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించింది. ‘వాస్తవంగా కత్తి మహేష్ వల్లే నేను ఫేమ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఆ ఇంటర్వ్యూలో అలా మాట్లాడటం.. దాన్ని నేను తీవ్రంగా ఖండించడంతో, ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. నిజానికి కత్తి మహేష్ గారితో నాకు ఎలాంటి గొడవలు లేవు అని తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుంటే.. ఒక యాంకర్‌గానే కాక, ఓ అభిమానికి స్టాండ్ తీసుకోవచ్చేమో అనిపించింది. అందుకే ఆయన మాటల్ని తీవ్రంగా ఖండించాను.

lahari shari relationship with pawan Kalyan
అయితే కత్తి మహేష్ గారు ఇంటర్వ్యూ మధ్యలో నుంచి లేచి వెళ్తారని, దాని వల్ల పెద్ద వైరల్ అవుతుందని నేను ఊహించలేదు. అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేను ఆ ఇంటర్వ్యూలో కత్తి మహేష్ తల్లి గురించి అడగడాన్ని చాలామంది తప్పు పట్టారు. నాకది తప్పు అనిపించలేదు. ఆ ప్రశ్నకు ఆయన మధ్యలో వెళ్లపోవడం కరెక్ట్ కాదనిపించింది. వివేక్ గారు కూడా మీ తల్లి పేరు ఏంటి ఆవిడ ఏం చేస్తారని మాత్రమే అడిగారు. కత్తి మహేష్ తల్లిని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. అమ్మ ఎవరికైనా అమ్మే కదా.
Lahari Shari : పవన్ కళ్యాణ్ నాలుగో భార్య అని తప్పుడు రాతలు రాశారు.
పవన్ కళ్యాణ్‌కి నాలాంటి అభిమానులు కోట్లలో ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అదే పనిగా పవన్‌ని విమర్శిస్తుంటే.. ఎవరు ఊరుకుంటారు. ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు. నేను కాస్త ముందు రియాక్ట్ అయ్యాను. అందుకే నామీద ఎన్నో నెగిటివ్‌గా కామెంట్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ నాలుగో భార్య అని తప్పుడు రాతలు రాశారు. నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు. అని లహరి అప్పటి విషయాలను చెప్పుకొచ్చింది.

lahari shari relationship with pawan Kalyan