Jr NTR : తన తమ్ముడిని పట్టించుకోవడంలేదని ఎన్టీఆర్ పై అలిగిన ప్రణతి..!!
Jr NTR : ఎన్టీఆర్ కి ఒక బామ్మర్ది ఉన్నాడు, ఆయన పేరే నార్నే నితిన్. ఆ మధ్య శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాతో నార్నే నితిన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమా కు దర్శకత్వం వహించబోతున్నాడని కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది. నార్నే వారే స్వయంగా ఆ సినిమాని నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. సినిమా ప్రకటించి చాలా కాలమైంది, కానీ ఇప్పటి వరకు కనీసం అప్డేట్ లేదు. అసలు బావమరిది నితిన్ గురించి ఎన్టీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలోనే తన సోదరుడి సినిమా గురించి ఎన్టీఆర్ పట్టించుకోవడంలేదని ఆయన భార్య లక్ష్మీ ప్రణతి అలక బోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతర హీరోల సినిమాల గురించి కుటుంబంలో హీరోల సినిమాల గురించి ఎన్టీఆర్ పెద్దగా పట్టించుకోడు. వారి సినిమాల యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు ఆహ్వానిస్తే వెళ్తాడేమో కానీ ఆ సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ విషయాలను మేకింగ్ విషయాలను అస్సలు పట్టించుకోడు. ఇప్పుడు అదే లక్ష్మీ ప్రణతికి కోపాన్ని తెప్పిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
భార్య భర్తల అన్నాక అలకలు సహజమే, కానీ లక్ష్మీ ప్రణతి అలక సోదరుడి సినిమా కెరియర్ గురించి.. మరి ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. మరో వైపు ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇటీవలే బెంగళూరులో నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్నను అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ పక్కన లక్ష్మి ప్రణతి కూడా ఉంది.