Jr NTR : ఎన్టీఆర్‌ని పెళ్లి చేసుకోవ‌డానికి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పెట్టిన కండీష‌న్స్ ఏంటో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : ఎన్టీఆర్‌ని పెళ్లి చేసుకోవ‌డానికి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పెట్టిన కండీష‌న్స్ ఏంటో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :8 August 2022,9:40 pm

Jr NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ అనే విష‌యం తెలిసిందే. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా భార్యా, పిల్లలు అంటే తారక్ కి ప్రాణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను, పిల్లలకు మీడియాకు కాస్తా దూరంగా ఉంచుతారు. ఏ పండుగలో, ప్రత్యేక రోజుల్లోనో ఫ్యామిలీతో కనిపిస్తారు. మిగతా సమయంలో కుటుంబ సభ్యులతో కనిపించడం కష్టమనే చెప్పాలి.ఇటీవ‌ల ప్ర‌ణ‌తితో క‌లిసి టీ తాగుతున్న పిక్ వైర‌ల్ కాగా, ఇందులో ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమోరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ సంతోష క్షణాల్లో మునిగితేలారు. ఆ పిక్ తెగ వైర‌ల్ అయింది.

Jr NTR : బాబోయ్ ఇన్ని కండీష‌న్సా?

అయితే కెరియర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాడు తార‌క్. తన బంధువులలో ఒకరైన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు ఎన్టీఆర్. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మి ప్రణతి కుందనపు బొమ్మ..తన కట్టు బొట్టుతో ఎన్టీఆర్ గౌర‌వాన్ని ఇంకా పెంచుతుంది. తారక్ ప్రణతి దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వారి పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్ . ఎన్టీఆర్ ది పెద్దలు కుదుర్చున పెళ్లి అయినప్పటికీ బంధువుల అమ్మాయి అవ్వడంతో వీరి ఇరువురు పెళ్లికి ముందు తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారట.

Lakshmi Pranathi conditions to Jr NTR

Lakshmi Pranathi conditions to Jr NTR

ఫోన్‌లో ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి.. ఎన్టీఆర్‌కి ప‌లు కండీష‌న్స్ పెట్టింద‌ట‌. పెళ్లి అయిన తర్వాత సినిమాలతో బిజీగా ఉన్నా సరే కొంచెం టైం ఫ్యామిలీ కోసం కేటాయించాలని ప్రణతి చెప్పిందట. పెళ్లి త‌ర‌వాత మీరు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం తగ్గించాలని కూడా చెప్పిందట. ఎన్టీఆర్ తన సినిమా షూటింగుల్లో అవుట్ డోర్ వెళ్లేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్ ని కూడా తానే తీసుకుంటానని ముందే చెప్పిందట. అంతేకాదు, తారక్ ఫుడ్ విషయం లో లక్ష్మి ప్రణతి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. ఇలా పెళ్లికి ముందే ఎన్టీఆర్‌కి చాలా కండీష‌న్స్ పెట్టింద‌ట ప్ర‌ణ‌తి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది