Intinti Gruhalakshmi : జోరు వానలో సామ్రాట్ కారు బ్రేక్ డౌన్.. భారీ వర్షంలో అర్ధరాత్రి నడి రోడ్డు మీద సామ్రాట్, తులసి.. ఆ తర్వాత ఏ జరుగుతుంది?
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 24 అక్టోబర్ 2022, ఎపిసోడ్ 771 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి పేరు మీద ఇల్లును పరందామయ్య రాసిచ్చాడని తెలియగానే నందును తీసుకొని లాస్య, భాగ్య అక్కడికి వస్తారు. తులసితో గొడవ పెట్టుకుంటారు. ఇంతలో సామ్రాట్ కూడా అక్కడికి రావడంతో అసలు సామ్రాట్ కు ఇక్కడేం పని. ఇది మా ఫ్యామిలీ విషయం. ఇందులో మీరు జోక్యం చేసుకోకపోతేనే మంచిది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లండి అని సామ్రాట్ తో నందు అంటాడు. దీంతో సామ్రాట్ వెళ్లిపోబోతుండగా తులసి ఆపుతుంది. మీరు ఎవరి కోసం వచ్చారు అని సామ్రాట్ ను అడుగుతుంది. దీంతో నీకోసమే అంటాడు సామ్రాట్. మరి.. నేను చెప్పకుండా ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తున్నారు. అలా వెళ్తే నేను ఫీల్ అవుతా అని అంటుంది తులసి. సామ్రాట్ నా ఫ్రెండ్. ఆయన ఎప్పుడైనా ఈ ఇంటికి వస్తారు.. అని అందరి ముందే చెబుతుంది తులసి.
అంతే కాదు.. సామ్రాట్ గారు, నేను ఇద్దరం కలిసి రేపు ఆఫీసు పని మీద వరంగల్ వెళ్తున్నాం అని కూడా చెబుతుంది తులసి. ఇద్దరం కలిసి ఒకే కారులో వెళ్తున్నాం అంటుంది తులసి. ఆ మాటలకు అనసూయ, లాస్య షాక్ అవుతారు. ఇంతలా తెగించి పోయింది తులసి అని అనుకుంటుంది లాస్య. నా కొడుకుకు ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వరని అనుకుంటున్నారా? నా కొడుకుకు నేనున్నా అంటూ అనసూయ నందు వైపు మాట్లాడుతుంది. నా కొడుకును ఈ ఇంటికి రానివ్వొద్దంటే నేను కూడా ఈ ఇంట్లో ఉండను అంటుంది అనసూయ. దీంతో మీ అబ్బాయిని ఈ ఇంటికి రావద్దని ఎవ్వరూ అనలేదు. ఆయన ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు.. ఎప్పుడైనా పోవచ్చు కానీ.. నా విషయంలో మాత్రం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెబుతుంది తులసి.
తులసికి వచ్చిన కాన్ఫిడెన్స్ చూసి పరందామయ్య చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత అనసూయ.. తులసి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పరందామయ్య వచ్చి ఏమైంది అని అడుగుతాడు. దీంతో తులసి గురించే ఆలోచిస్తున్నా అంటుంది అనసూయ.
Intinti Gruhalakshmi : తులసిని ఈ ఒక్క విషయంలో బాధపెట్టకు అని అనసూయనను కోరిన పరందామయ్య
నువ్వు ఈ ఒక్క విషయంలో ఎందుకు తులసి బాధను అర్థం చేసుకోవడం లేదు అని అడుగుతాడు పరందామయ్య. అన్ని నువ్వు చెప్పినట్టే వింటోంది కదా. ఈ ఒక్క విషయం మాత్రం ఎందుకు నువ్వు వినడం లేదు అని అంటాడు పరందామయ్య. మీరూ తనవైపే మాట్లాడుతున్నారా అంటుంది అనసూయ.
ఆ తర్వాత తులసి తన బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే సామ్రాట్ ఫోన్ చేస్తాడు. సారీ చెప్పడం కోసం ఫోన్ చేస్తాడు. నా వల్లే మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. నేను రావడం వల్లే అవుతున్నాయి అంటాడు. దీంతో మీరు రావడం వల్ల కాదు.. అది మాకు రోజూ ఉండేదే.. అంటుంది తులసి.
ఆ తర్వాత రేపటి వరంగల్ టూర్ గురించి తులసితో డిస్కస్ చేస్తాడు సామ్రాట్. ఆ తర్వాత తనను ఫైల్ తీసుకొని రమ్మంటాడు. దీంతో సరే అంటుంది తులసి. ఆ తర్వాత తెల్లవారుతుంది. లాస్యకు మరో ఐడియా వస్తుంది. మనం వెంటనే మీ ఇంటికి వెళ్దాం అంటుంది నందుతో.
దీంతో ఇప్పుడు ఎందుకు అక్కడికి అంటాడు నందు. దీంతో అక్కడ నేను ఒక విషయం గమనించాను. మీ అమ్మ నీకు సపోర్ట్ ఇవ్వడం గమనించావా అని అడుగుతుంది. దీంతో అవును అంటాడు. అంటే.. మనకు మీ అమ్మ సపోర్ట్ ఉందన్నమాట. వెళ్లి ఇంకా అత్తయ్య గారిని మనవైపునకు తిప్పుకోవాలి పదా అంటుంది లాస్య.
మరోవైపు తులసి.. వరంగల్ వెళ్లేందుకు రెడీ అవుతుంటే అనసూయకు చాలా కోపం వస్తుంది. మరోవైపు పరందామయ్య వచ్చి ఏమైందమ్మా ఇంకా సామ్రాట్ రాలేదు అంటుంది. దీంతో అనసూయకు ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి వరంగల్ వెళ్తారు.
కట్ చేస్తే రాత్రి అవుతుంది. చాలా వర్షం కురుస్తూ ఉంటుంది. వర్షంలో తులసి, సామ్రాట్ ఇద్దరూ కారులో వరంగల్ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తుంటారు. దారి కూడా కనిపించకుండా జోరుగా వర్షం కురుస్తుండటంతో ఏం చేయాలో తెలియదు సామ్రాట్ కు.
మరోవైపు తులసి ఇంకా రాలేదని ఇంట్లో వాళ్లు టెన్షన్ పడుతూ ఉంటారు. మనం టెన్షన్ పడుతున్నాం కానీ.. ఇద్దరూ హ్యాపీగానే ఉండి ఉంటారు అంటాడు నందు. ఆ తర్వాత కారు బ్రేక్ డౌన్ అవడంతో ఇద్దరూ కలిసి కారు దిగుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.