Lavanya Tripathi : వరుణ్‌తేజ్‌పై లావణ్య త్రిపాఠికి లవ్ ఉందనడానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఉంటుందా?
Lavanya Tripathi: సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌లో ఎంత నిజం ఉంటుందో తెలియదు కాని కొన్ని వార్తలు మాత్రం తెగ హల్‌చల్ చేస్తుంటాయి. గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుంది అంటూ ప్రచారాలు నడుస్తున్నాయి.వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కలిసి ”మిస్టర్, అంతరిక్షం” సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఆ తర్వాత నిహారిక పెళ్లికి లావణ్య త్రిపాఠి ప్రత్యేకంగా వెళ్లి సందడి చేయడంతో జనాల్లో అనుమానాలు షురూ అయ్యాయి. వరుణ్‌తో లావణ్య సీక్రెట్ రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తోందనే టాక్ బలంగా వినిపించింది. దీనిపై ఈ ఇద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే మధ్యలో కొంత ఆగిన రూమర్స్ ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి.
Lavanya Tripathi : వీరిద్దరి వ్యవహారం తేడాగా ఉందే…
వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘గని’ విడుదల సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టిన లావణ్య ఆయనపై పాజిటివ్ రియాక్షన్ ఇచ్చింది. ”వరుణ్.. ఈ రోల్ కోసం నువ్వు 110 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టావని తెలుసు. నీతో పాటు నీ టీమ్ చేసిన హార్డ్ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కి ‘గని’ సినిమా గొప్ప విజయం సాధించాలని ప్రార్థిస్తున్నా” అని ట్వీట్ పెట్టింది లావణ్య. దీంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ”నీ కోసమే వెయిటింగ్, థాంక్యూ లావణ్య, ఏదో తేడాగా ఉంది” అంటూ మెగా ఫ్యాన్స్ స్పందిస్తుండటం గమనార్హం.
వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీ గని. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నేడు ప్రేక్షకుల మందుకు వచ్చింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఫస్టాఫ్ బాలేదని, సెకండాఫ్ అదరగొట్టాడని, ముఖ్యంగా వరుణ్ తేజ్ మైండ్ బ్లోయింగ్ నటన అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.