Bigg Boss 5 Telugu : బాత్రూంలో లోబో అలాంటి పని.. ఒక్కసారిగా అవాక్కైన కంటెస్టెంట్లు
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 ఇంట్లో లోబోది విచిత్రమైన కారెక్టర్. ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడతాడు..ఏం చేస్తాడు అన్నది ఎవ్వరూ ఊహించలేరు. రవి బెస్ట్ ఫ్రెండ్ అంటాడు..అతడిని నామినేట్ చేస్తాడు లోబో. తోపు డూపు చెప్పమంటే కూడా తాను క్లోజ్‌గా ఉన్న వాళ్లనే డూపు అని చెప్పేశాడు. అలా లోబో చేష్టలు ఎవ్వరికీ అంత ఈజీగా అర్థం కావు. అయితే లోబో మాత్రం ఇంటి సభ్యులను నవ్వించేందుకు ప్రయత్నిస్తుంటాడు. తన భాష, చేష్టలతో లోబో అందరినీ నవ్విస్తుంటాడు.

Lobo Fun At Batheroom area In Bigg Boss 5 Telugu
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంట్లో లాక్డౌన్ విధించారు. ఏ ఒక్కరికీ కూడా ఇంట్లోకి ప్రవేశం లేకుండా పోయింది. ఇంట్లోకి వెళ్లాలంటే కొన్ని టాస్కులు చేయాల్సి వచ్చింది. అలా ఇంట్లోకి ప్రవేశం లేకపోవడంతో గార్డెన్ ఏరియా, బాత్రూం ఏరియాలో కంటెస్టెంట్లంతా కూడా సేదతీరారు. ఆ సమయంలో అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నామినేషన్స్ సమయంలో ఒక్కో కంటెస్టెంట్ ఎలా ప్రవర్తించారో చూపిస్తూ ఇమిటేట్ చేశారు.
Bigg Boss 5 Telugu బాత్రూంలో లోబో రచ్చ

Bigg Boss 5 Telugu
అయితే లోబో మాత్రం ఒక్కసారిగా వచ్చి అందరి వైపు నిల్చుని ఒక్కసారిగా బాంబ్ వదిలేశాడు. దీంతో అందరూ ముక్కులు మూసుకున్నారు. ఇక షన్ను అయితే ఏకంగా లోబో బ్యాక్ మీద సెంటు కొంటేశాడు. రూమంతా స్ప్రే చల్లేశాడు. లోబో చేసిన పనికి ఒక్కొక్కరు చచ్చిపోయారు. అలా లోబో వచ్చి గ్యాస్ వదలడంతో అందరూ అక్కడి నుంచి పారిపోయారు. ముందు బాత్రూంకు వెళ్లు అంటూ అందరూ లోబోను తరిమికొట్టేశారు.