Anchor Suma : ఇన్ని సార్లు తిట్టించుకుంటావా? బుద్దిలేదా?.. లోబో గాలి తీసేసిన సుమ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : ఇన్ని సార్లు తిట్టించుకుంటావా? బుద్దిలేదా?.. లోబో గాలి తీసేసిన సుమ

 Authored By aruna | The Telugu News | Updated on :21 September 2022,11:30 am

Anchor Suma : సుమ తన క్యాష్ షోతో ప్రతీ శనివారం ప్రేక్షకులందరినీ అలరిస్తుంటుంది. ఈ షో ఎన్నో రూపాంతరాలుగా మారి.. చివరకు ఇప్పుడున్న క్యాష్ షోగా వస్తోంది. మొదట్లో జీన్స్ అంటూ వచ్చేది. ఇప్పుడు క్యాష్ షోగా గత కొన్నేళ్ల నుంచి అలరిస్తూనే వస్తోంది. క్యాష్ షోలో ఇది వరకు వచ్చిన గెస్టులే వస్తుంటారు. ఇక ఈ వారం మాత్రం కాస్త కొత్త మొహాలనే పిలిచినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన లోబో, ఉమాదేవీ, విశ్వలతో పాటుగా నటి సింధూరను పిలిచారు.

ఇక బిగ్ బాస్ ఇంట్లో లోబో, ఉమాదేవీ, విశ్వ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. విశ్వ సింపతీ ప్లే చేశాడని అందరూ అన్నారు. ఉమాదేవీ తన యారగెన్సీతో చెడ్డ పేరు తెచ్చుకుంది. అలా మొత్తానికి లోబోకి కాస్త మంచి పేరు వచ్చింది. లోబో ఉమాదేవీల ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి రొమాన్స్‌ను బిగ్ బాస్ ప్రేక్షకులు చూడలేకపోయారు. ఈ ఇద్దరి ట్రాక్ కామెడీ వరకే అయినా కూడా జనాలు తట్టుకోలేకపోయారు.

Anchor Suma Funny Counters on Lobo in Cash Promo

Anchor Suma Funny Counters on Lobo in Cash Promo

ఇక ఇప్పుడు క్యాష్ షో స్టేజ్ మీద కూడా అదే రొమాన్స్ చేశారు. ఈ షో అంతా మీ రొమాన్స్ చూడలేక చావాలి అంటూ సుమ కూడా కౌంటర్లు వేసింది. ఇక సుమ ఓ టాస్క్ ఇచ్చింది. తమ చెవిలో ఓ జంతువు పేరు చెబుతామని, దాన్ని యాక్ట్ చేసి చూపించాలి.. మిగతా వాళ్లు కనుక్కోవాలని అన్నారు. విశ్వకు కోతి అని చెప్పినట్టున్నారు. కోతిలా ఎగిరేందుకు విశ్వ తెగ ప్రయత్నించాడు. ఇక లోబో వంతు వచ్చింది.

లోబోకు పిచ్చి కుక్క అని ఇచ్చినట్టున్నారు. కుక్కలా చేసేందుకు లోబో కష్టపడ్డాడు. పక్క నుంచి సింధూర. కుక్కా?.. పిచ్చి కుక్కా? అని ఇలా అంటూనే ఉంది. అయినా లోబో చేస్తూనే ఉన్నాడు. ఇన్నిసార్లు మొహం మీదే కుక్క పిచ్చి కుక్క అనిపించుకుంటున్నావ్.. బుద్దిలేదా? ఆల్రెడీ ఆన్సర్ చెప్పింది కదా? అని లోబో గాలి తీసింది సుమ.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది