Getup Srinu : ఎవడ్రా వాడు.. గెటప్ శ్రీను పరువుతీసిన లోకులు కాకులు ఆంటీ

Authored By aruna | The Telugu News | Updated on : 26 August 2022, 11:20 am

Getup Srinu : సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం కష్టం. ఫేమస్ అవ్వడానికి సపరేట్ కారణం కూడా ఉండదు. అలా ఫేమస్ అవుతారంతే. అందరిలో కెల్లా కాస్త డిఫరెంట్‌గా కనిపించినా, మాట్లాడినా, ఎక్స్ ట్రాలు చేసినా చాలు నెట్టింట్లో ఒక్కసారిగా ఫేమస్ అవుతారు. ఇక ఈ మధ్య అయితే సినిమా థియేటర్ల ముందు రివ్యూలు చెబుతూ కొంత మంది నానా హంగామా చేస్తున్నారు. వారిలో చాలా మంది ఎంతో క్రేజ్ దక్కించుకున్నారు. అందులో ఒకరు లోకులు కాకులు ఆంటీ. లోకులు కాకులు ఆంటీ నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతుంటుంది. ఆమె మాటలు సగం మందికి అర్థమే కావు. అలా లోకులు కాకులు ఆంటీ ఓ సమయాన మరింత క్రేజ్ దక్కించుకుంది.

యూట్యూబ్‌లో ఫుల్ ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. అలాంటి ఆంటీని ఇమిటేట్ చేసేందుకు గెటప్ శ్రీను ముందుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో గెటప్ శ్రీను దుమ్ములేపేశాడు. తనకు బుల్లితెర కమల్ హాసన్ అనే పేరు ఎందుకు ఇచ్చారో.. ఎందుకు తాను దానికి అర్హుడే తాజాగా గెటప్‌తో నిరూపించేశాడు. లోకులు ఆంటీలా మారిపోయాడు గెటప్ శ్రీను. అయితే ఇదే స్కిట్లో ఒరిజినల్ లోకులు కాకులు ఆంటీని కూడా తీసుకొచ్చారు. ఇక ఎవరు డూప్ ఎవరు ఒరిజినల్ అన్న దాంతో స్కిట్ చేశారు. అయితే ఈ స్కిట్లో భాగంగా లోకులు కాకులు ఆంటీ రాం ప్రసాద్, గెటప్ శ్రీను, జబర్దస్త్ షో గురించి చెప్పుకొచ్చింది.

Lokulu Kaakulu Aunty Satires on Getup Srinu In Extra Jabardasth

Lokulu Kaakulu Aunty Satires on Getup Srinu In Extra Jabardasth

పనిలో పనిగా జబర్దస్త్ జోడి అయిన వర్ష ఇమాన్యుయేల్ మీద కూడా స్పందించింది. అమ్మా నీకు గెటప్ శ్రీను ఎవడో తెలుసా? అని రాం ప్రసాద్ అడుగుతాడు. ఎవడ్రా వాడు అంటూ కసురుకుంటుంది ఆంటీ. దీంతో పక్కనే ఉన్న గెటప్ శ్రీను పరువుపోతుంది. ఇంతలో ఇమాన్యుయేల్ లేచి.. నీకు వర్ష ఇమాన్యుయేల్ లవ్ స్టోరీ తెలుసా? అని అడుగుతాడు. తూ అంటూ ఊసేస్తుంది లోకులు కాకులు ఆంటీ. వర్షను చూస్తే మీరు అలా అనరు.. ఆమె చాలా బాగుంటుంది అని ఇమాన్యుయేల్ అంటాడు. అవును ఆమె బాగుంటుంది.. నువ్వే బాగుండవు అని మరో కౌంటర్ వేస్తుంది. అలా మొత్తానికి లోకులు కాకులు ఆంటీ మాత్రం ప్రోమోలో అదరగొట్టేసింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి