JR NTR : ఆర్ఆర్ఆర్ మూవీ దెబ్బ.. ఎన్టీఆర్‌కు కోట్లల్లో నష్టం..?
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు ఒకప్పుడు వినిపించేంది. కానీ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే.. వరుస మూవీస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు యంగ్ టైగర్.. టైగర్ సినిమా మొదలుకొని అరవింద సమేత వరకు వరుసగా ఐదు హిట్స్ అందుకుని దూసుకుపోతున్నాడు. ఈ టైంలోనే ఆర్ఆర్ఆర్ మూవీ చేసేందుకు డిసైడ్ అయ్యాడు. ఫ్లాప్స్ ఎరుగని డైరెక్టర్ కావడం. భారీ బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేస్తుండటంతో ఎన్టీఆర్ ఓకే చెప్పాడని టాక్. ఇక ఈ మూవీ హిట్ అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అవడం ఖాయం.కానీ ఈ మూవీ రిలీజ్ కు అనేక చిక్కులు వచ్చి పడుతున్నాయి
. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలసమైంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మరో ఏడాది గడిచిపోయింది. ఎలాగైనా దీనిని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలన్నదే రాజమౌళి కల. దాని కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీని తెరకెక్కించాడు.2018లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మూడేండ్లు గడుస్తున్నా రిలీజ్ చేసేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఈ మూవీ ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇండస్ట్రీలో ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ అయిన మూవీగా రికార్డుల్లోకెక్కింది.
JR NTR : మూడేండ్లలో ఎన్ని కోట్లంటే..
ఈ మూవీకి ఎన్టీఆర్ సుమారు 35 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్. ఈ మూడేండ్లలో ఎంతలేదన్నా సుమారు ఐదారు మూవీస్ చేసుకునే వాడు ఎన్టీఆర్. దీని వల్ల దాదాపు ఆయన రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. దీనిని భర్తీ చేయాలంటే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా మారక తప్పదు. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం సైన్ చేసినప్పటి నుంచి ఎన్టీఆర్ ఏమూవీ చేయలేదు. రామ్‌చరణ్ మాత్రం ఆచార్య మూవీ షెడ్యూల్ పూర్తి చేసుకుని, మరో రెండు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.