RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’పై లైకా గురి.. అన్ని కోట్లకు అమ్ముడుపోయింది!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: March 8, 2021, 1:38 pm

RRR Movie : లైకా సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్‌లో భారీ బడ్జెట్ చిత్రాలకు లైకా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కోలీవుడ్, టాలీవుడ్‌లో లైకా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించింది. శంకర్, రజినీకాంత్, విజయ్, మురుగుదాస్ వంటి స్టార్ల చిత్రాలను లైకా నిర్మిస్తుంటుంది. అయితే అలాంటి భారీ నిర్మాణ సంస్థ తాజాగా ఆర్ఆర్ఆర్ తమిళనాడు హక్కులను చేజిక్కించుకుంది. ఆ రేట్‌ను వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

గత రెండు మూడు రోజుల నుంచి ఈ ఢీల్ గురించి లెక్కలేనన్ని పుకార్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను లైకా భారీ మొత్తానికి కొనేసింది.తమిళ నాడు మొత్తంగా లైకా సంస్థ ఆర్ఆర్ఆర్‌ను పెద్ద మొత్తంలోనే రిలీజ్ చేయనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. గతంలో తెలుగులో ఖైదీ నెం.150తో పాటు రోబో 2.0, దర్బార్‌ వంటి భారీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా ఈ సంస్థ వ్యవహరించింది.‘భారీ పాన్‌ ఇండియా సినిమా (ఆర్ఆర్ఆర్) హక్కులు సొంతం చేసుకున్నామని గర్వంగా ప్రకటిస్తున్నాం’ అని నిర్మాణ సంస్థ ట్విటర్‌లో చెప్పింది…

 

rrr he has more responsibility than rajamouli

rrr he has more responsibility than rajamouli

RRR Movie : అన్ని కోట్లకు అమ్ముడుపోయింది!

లైకా ప్రొడక్షన్స్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థియేట్రికల్‌ హక్కులు సొంతం చేసుకుంది. భారీ చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా భారీస్థాయిలో విడుదల చేసేందుకు ముందుకు వెళుతున్నామంటూ డీవీవీ పేర్కొంది. అయితే ఈ మూవీని దాదాపు 42 కోట్లకు లైకా సొంతం చేసుకుందని తెలుస్తోంది. గతంలో బాహుబలిని 32 కోట్లే పలికింది. కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ 2021 అక్టోబర్‌ 13న ఈ చిత్రం విడుదల కానుంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp