Manchu Vishnu : “మా” అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు..!!
Manchu Vishnu : “మా” అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది అసోసియేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నన్ను విభేదించిన తప్పులేదు. కానీ మొత్తం అసోసియేషన్ నీ తప్పుపడుతూ మాట్లాడటం తగదు అని పేర్కొన్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే.. చర్చించుకోవడానికి వేదిక ఉందని చెప్పుకొచ్చారు. మీడియా దాకా వెళ్లి “మా” అసోసియేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని ఇది చాలా తప్పని మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి జన్మదిన వేడుకకు ఫోన్ లు చేసి మాట్లాడుతున్నా.
వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాను. ఇదే సమయంలో ఎవరికైనా సమస్య ఉంటే ఫోన్ చేస్తున్నారు అంటూ మంచు విష్ణు స్పష్టం చేయడం జరిగింది. మేమంతా కుటుంబంలో కలిసి ఉంటున్నాం. ఇటువంటి పరిస్థితులలో అసోసియేషన్ నీ తప్పుపడుతూ వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ఇంతకి వివాదం ఎక్కడ వచ్చిందంటే “RRR” కి ఆస్కార్ రావడంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులు, సినిమా ప్రముఖుల హాజరయ్యారు. అయితే టాలీవుడ్ ప్రధాన విభాగాల్లో ఒకటైన “మా” అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు హాజరు కాలేదు. అయితే ఆ సమయంలో మంచు విష్ణు విదేశాలలో ఉండటంతో మా అసోసియేషన్ తరపున వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో మంచు విష్ణు రాకపోవడంపై ఆయనపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఇటువంటి పరిస్థితులలో మంచు విష్ణు లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
