Madonna Sebastian : జాకెట్ వేసుకోకుండా చీరకట్టులో మతులు పోగొడుతున్న నాగ చైతన్య బ్యూటీ..!
Madonna Sebastian : నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మడోన్నా సెబాస్టియన్. తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన మడోన్నాతొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది . నాని చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించి అలరించింది ఈ మలయాళ కుట్టి. మడోన్నా సెబాస్టియన్ నటిగా మారకముందు గాయనిగా మలయాళ సినీ పరిశ్రమకు సుపరిచతం. గోపి సుందర్, దీపక్ దేవ్ లాంటి సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. సూర్య టీవీలో మ్యూజిక్ మోజో షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రేమమ్ సినిమా రూపంలో సినిమా అవకాశం తలుపుతట్టింది.
సంగీతంలో ప్రావీణ్యం, సమజమైన అందం ఆమె చిత్ర దర్శకుల దృష్టిలో పడడానికి కారణమైంది. కేరళలోని ఎర్నాకులంలో జన్మించిన మడోన్నా సెబాస్టియన్ బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో పట్టాపొందింది. ప్రేమమ్ సినిమా తర్వాత కదాలమ్ కదందు పొగమ్ అనే చిత్రంతో తమిళ చిత్రం రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ప్రేమమ్ చిత్రంలో ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం పా పాండి, జుంగా, వైరస్, కొటిగబ్బ 3 చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.ఎప్పటికప్పుడు తనలోని సరికొత్త టాలెంట్ బయటకు తీస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తుంటుంది మడోన్నా సెబాస్టియన్.

madonna sebastian latest photos shakes the internet
Madonna Sebastian : మతులు పోగొడుతున్న మడోన్నా..
ఈ ముద్దుగుమ్మ తాజాగా జాకెట్ వేసుకోకుండా రచ్చ చేసింది. జాకెట్ లెస్‌లో మడోన్నా ఇచ్చిన ఫోజులు మతులు పోగొడుతున్నాయని నెటిజన్స్ అంటున్నారు. మరో విభిన్నమైన పాత్ర కోసం మడొన్నా రెడీ అవుతున్నారేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ చిన్నది. నిత్యం గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది మడోన్నా సెబాస్టియన్. తాజాగా మడోన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మడోన్నా రానున్న రోజులలో మరిన్ని మంచి ఆఫర్స్ అందుకోవడం ఖాయమంటున్నారు.