Madonna Sebastian : ఎరుపెక్కిన అందం.. మడోన్నా సెబాస్టియన్ గ్లామర్ షోకి అంతా ఫిదా
Madonna Sebastian : మడోన్నా సెబాస్టియన్.. నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. సంగీతంలో ప్రావీణ్యం, సమజమైన అందం ఆమె చిత్ర దర్శకుల దృష్టిలో పడడానికి కారణమైంది. కేరళలోని ఎర్నాకులంలో జన్మించిన మడోన్నా సెబాస్టియన్ బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో పట్టాపొందింది. ఆమె మ్యూజిక్ కాన్సర్ట్స్‌కు యువతలో ఎంతగా క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కర్నాటక, పాశ్చాత్య సంగీతంలో శిక్షణ పొందిన మడోన్నా మ్యూజిక్ మోజో అనే టీవీ షో ద్వారా ఫేమస్ అయింది.
ప్రేమమ్ దర్శకుడు అల్ఫోన్స్ పుతారెన్ తన ప్రాజెక్ట్ కోసం మడోన్నాను ఆడిషన్‌కు పిలిచి ముందు మేరీ పాత్రకోసం సెలెక్ట్ చేశారు. తమిళంలో నటించిన ‘కాదలుమ్ కాదందు పోగుమ్’ హిట్ అయి మడోన్నాకు మంచి పేరు తీసుకు వచ్చింది. దాని తర్వాత వచ్చిన ‘కింగ్ లయర్’ మలయాళ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. సుమేష్ లాల్ దర్శకత్వంలో ‘హ్యూమన్స్ ఆఫ్ సమ్ వన్’ అనే హాలీవుడ్ మూవీలోనూ మడోన్నాకు నటించే అవకాశం వచ్చింది. 2015లో రాబీ అబ్రహం సంగీత సారధ్యంలో ‘యూ టూ బ్రూటస్’ చిత్రం కోసం రావుకలిల్ అనే పాటను పాడింది.

madonna sebastian stunning looks in viral
Madonna Sebastian : మడోన్నా అందాలు అదుర్స్
తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన మడోన్నా వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది. తెలుగులో ప్రేమమ్ సినిమా చేసి.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది మడోన్నా. రీసెంట్‌గా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యాంసింగరాయ్‌లో అదరగొట్టింది. మడోన్నా రోల్ చిన్నదే అయినా తన పాత్రకు తగిన న్యాయం చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ బ్యూటీ హోయలు పోతూ అదరగొట్టే అందంతో అలరించింది. ఈ అమ్మడి పిక్స్ వైరల్‌గా మారాయి.