Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న స్టార్ డం అంతా ఇంతా కాదు ఆయన ఒక్క యాడ్లో కనిపిస్తే కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇచ్చేందుకు పదుల సంఖ్యలో కంపెనీలు క్యూలో ఉన్నాయి. అలాంటి మహేష్ బాబు ఒక కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైతే ఆ షో యొక్క రేటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే మహేష్ బాబు తమ షో కి రావాలంటే చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఆయన మాత్రం ఫ్రీ గా అలాంటి కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించరని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిర్వహిస్తున్న ఒక డాన్స్ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొన్న విషయం తెలిసిందే.
ప్రత్యేక అతిథిగా పాల్గొన్న మహేష్ బాబు తనతో పాటు కూతురు సితారను కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. సితార మరియు మహేష్ బాబు రాకతో ఆ కార్యక్రమం స్థాయి ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయింది. తండ్రి కూతురు కలిసి కార్యక్రమానికి రావడంతో జీ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆ కార్యక్రమాన్ని చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక జీ తెలుగు యాజమాన్యం కూడా ఆ షో ను చాలా ప్రత్యేకంగా ప్రసారం చేయాలని భావిస్తున్నారు. అంతా బానే ఉంది కానీ బుల్లి తెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆ కార్యక్రమంలో మహేష్ బాబు మరియు సితార పాల్గొన్నందుకు గాను కవర్ తీసుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మహేష్ అభిమానులు మాత్రం ఇలాంటి చిన్న కార్యక్రమాలకు మహేష్ బాబు హాజరవ్వడమే చాలా అరుదుగా కనిపిస్తుంది, అలాంటిది ఒక చిన్న కార్యక్రమానికి డబ్బులు తీసుకొని హాజరవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. మహేష్ బాబు ఒక్కో సినిమాకు పదుల కోట్ల పారితోషకాన్ని తీసుకుంటూ ఉంటాడు. అలాంటిది చిన్న కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చేందుకు కూడా పారితోషికం డిమాండ్ చేసే తక్కువ స్థాయి ఆయనది కాదు అని కొంత మంది అంటూ ఉంటే, మరి కొందరు మాత్రం తమ వల్ల లాభపడ్డ వారి దగ్గర నుండి పారితోషికం తీసుకోవడంలో తప్పేం లేదు. కనుక మహేష్ బాబు జీ తెలుగు వద్ద కొంత మొత్తాన్ని తీసుకుంటే తప్పేం లేదు అంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. అసలు విషయం ఏంటి అనేది జీ తెలుగు వారు స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.