Mahesh Babu : అన్న రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు హాజరు అయ్యేనా?
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి వార్త కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారికి తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. మహేష్ బాబు ఇటీవలే కరోనా బారిన పడ్డట్లుగా పేర్కొన్నాడు. స్వల్ప లక్షణాలతో ఉన్న మహేష్ బాబు ఆరోగ్యం గురించి అంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్యం విషయంలో చర్చించుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆయన సోదరుడు రమేష్ బాబు మృతి చెందడటం ఆవేదన కలిగించే విషయం. మహేష్ బాబు కోవిడ్ తో బాధ పడుతున్న ఈ సమయంలో రమేష్ బాబు మృతి చెందడం ఆ కుటుంబ సభ్యులకు మరింత ఆవేదన కలిగించే విషయం అనడంలో సందేహం లేదు.
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా అత్యంత సింపుల్ గా అంత్యక్రియలు జరుపబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ ప్రకటించడం జరిగింది. మహేష్ బాబు కుటుంబ సభ్యులు నలుగురు కూడా ఇప్పుడు క్వారెంటైన్ లో ఉన్నారు. నలుగురికి కూడా కోవిడ్ ఉన్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. కాని అధికారికంగా మాత్రం మహేష్ బాబు మాత్రమే కరోనాతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కోవిడ్ పాజిటివ్ కనుక అన్న రమేష్ బాబు అంత్య క్రియలకు హాజరు అయ్యే అవకాశాలు లేవు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కొడుకు అంత్య క్రియలకు హాజరు అయ్యే అవకాశాలు లేవు.

Mahesh babu brother Ramesh babu passaway
Mahesh Babu : మహేష్ బాబు, రమేష్ బాబుల మద్య రిలేషన్ ఎలా ఉండేది?
మహేష్ బాబు మరియు కృష్ణ లు ఇద్దరు కూడా రమేష్ బాబు చివరి చూపును చూసేందుకు వీలు కల్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. నేడు సాయంత్రం వరకు కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ కు అనుగుణంగానే రమేష్ బాబు అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. రమేష్ బాబు మరియు మహేష్ బాబుకు మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య ఆర్థికంగా ఉన్నతి చెందాలనే ఉద్దేశ్యంతో ఆయన నిర్మాణంలో పలు సినిమాలను మహేష్ బాబు చేసిన విషయం తెల్సిందే.
రమేష్ బాబు నటుడిగా ఫెయిల్ అవ్వడంతో మహేష్ బాబు నిర్మాతగా అయినా అన్నయ్యను నిలబెట్టాలని ప్రయత్నించాడు. కాని అది సాధ్యం కాలేదు. పెద్ద ఎత్తున ఇండస్ట్రీ వర్గాల్లో రమేష్ బాబు గురించిన పుకార్లు ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయమై కష్టాల్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని రమేష్ బాబుకు ఆర్థిక పరమైన కష్టాలు ఏమీ లేవు. ఆయన తన వ్యాపారాలతో చాలా హ్యాపీగా ఉండేవాడు. కాని ఇంతలో ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.