Home » Entertainment » Mahesh Babu Guntur Karam Movie Update 2
Entertainment

మహేష్ బాబు కి నచ్చలేదు అని తెలిసి షూటింగ్ స్పాట్ లోంచి వాళ్ళని పంపించేసిన త్రివిక్రమ్ ?

Authored By
aruna
The Telugu News | Published on: July 10, 2023, 3:00 pm
Advertisement

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమా చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా స్టంట్ కొరియోగ్రాఫర్ విషయంలో కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం. ఈ సినిమాకి ముందుగా అనుకున్న ఫైట్ మాస్టర్స్ వేరు, ఆ తర్వాత వచ్చిన మార్పులు వేరు అని టాక్ వినిపిస్తుంది. ముందుగా ఈ సినిమాకి కేజిఎఫ్ సినిమా ఫైట్ మాస్టర్లను ఎంపిక చేశారు. కానీ వారి పనితనం వర్కింగ్ స్టైల్ మహేష్ కి ఏమాత్రం నచ్చలేదట. ఆ తర్వాత రామ్ లక్ష్మణ్ లను ఎంపిక చేశారని కథనాలు వచ్చాయి.

Advertisement

ఆ తర్వాత కూడా ఒక్కో ఫైట్ కి ఒక్కో స్టంట్ కొరియోగ్రాఫర్ ని ఎంచుకోవాలని ప్లాన్ చేసారట. కారణం ఏదైనా కానీ ఫైట్స్ విషయంలో మహేష్ – త్రివిక్రమ్ రాజీకి రావడం లేదని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. భారీగా అడ్వాన్సులు చెల్లించి కేజిఎఫ్ ఫైట్ మాస్టర్లను వదులుకున్నారంటే మహేష్ బాబు త్రివిక్రమ్ లు ఫైట్ కొరియోగ్రాఫర్ విషయంలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా లాంటి సినిమాలో త్రివిక్రమ్ సెలెక్ట్ చేసిన స్టంట్స్ బాగా హిట్ అయ్యాయి.

Guntur karam movie

Advertisement

ఇప్పుడు రాబోతున్న మూడో సినిమా గుంటూరు కారం లో కూడా స్టంట్స్ పరంగా మరో లెవెల్ ని చూపించేందుకు అనల్ అరసు లాంటి టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్ ని బరిలో దించారని తెలుస్తుంది. తమిళ టాప్ డైరెక్టర్స్ మణిరత్నం, లింగుస్వామి, శంకర్, మురుగదాస్ వంటి టాప్ డైరెక్టర్ తో పనిచేసిన అనల్ అరసు దాదాపుగా 300 పైగా సినిమాలకు ఫైట్ సీన్ కంపోజ్ చేశారు. అందుకే మహేష్ బాబు త్రివిక్రమ్ అతడిని నమ్మి గుంటూరు కారం సినిమాకి ఫైట్ మాస్టర్ గా తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి