ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవంతరంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో వైసీపీ అధికారంలోకి రాకుండా చేయాలని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి వారు ప్రజలలో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేత ఫామ్ హౌస్ లో సందడి చేశారు. పూర్తి విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తుండగా.. గర్లదీన్నే మండలం కనంపల్లి వద్ద ఆగటం జరిగింది. దీంతో అల్లు అర్జున్ రాక తెలుసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటనే ఫోన్ చేసి తమ ఫామ్ హౌస్ కి స్వాగతం పలికారు.
సింగనమల ద్వీసభ్య కమిటీ సభ్యులు మంటిమడుగు కేశవరెడ్డి ఆహ్వానించడం జరిగింది. ఇదే సమయంలో కేశవరెడ్డి కుమారుడు రాహుల్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఫామ్ హౌస్ కి వచ్చిన బన్నీకి ప్రత్యేకమైన రాయలసీమ వంటకాలు రుచి చూపించారు. అయితే ఊహించని విధంగా అల్లు అర్జున్ వచ్చినట్లు ఆ ప్రాంతంలో తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతతో అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు..ఫోటోలు..వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప 2” చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇది పూర్తిగా కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నారు. కొద్దిరోజుల క్రితం త్రివిక్రమ్.. బన్నీ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కావడంతో పాటు బన్నీ భార్య స్నేహ రెడ్డికి వీలు బంధువులు అని అందువల్లే అల్లు అర్జున్ అటు వెళ్తూ వాళ్ళ పిలుపుమేరకు.. ఫామ్ హౌస్ కి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.