Mahesh babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా క్యాన్సిల్ .. అందుకు కారణం ఆ స్టార్ హీరోనే ..

Advertisement

Mahesh babu : దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. అలా ఛాన్స్ వచ్చినా మధ్యలో ఆ సినిమా ఆగిపోతే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ప్రస్తుతం మహేష్ బాబు విషయంలో ఇలానే జరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచర్ సినిమాను చేయడానికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఈ సినిమాను ఆపేసి మరో ప్రాజెక్ట్ ఎక్కించే పనిలో బిజీ అయిపోవాలి అనుకుంటున్నాడు రాజమౌళి.

Advertisement

అయితే రాజమౌళి జాతకం ప్రకారం మహేష్ బాబుతో ఈ సమయంలో సినిమా చేస్తే అది కచ్చితంగా డిజాస్టర్ అవుతుందని ఓ పండితులు చెప్పుకొచ్చారట. అయితే ఇలాంటివి నమ్మని రాజమౌళి అనుకోకుండా ఆ సినిమా లేట్ అవుతూ రావడం జరిగింది. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న గుంటూరు కారం సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి విడుదల అయిపోవాల్సింది. కానీ మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ కారణంగా సినిమా లేట్ అవుతూ వచ్చింది. ఇప్పటికి సగం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా మిగతా సగం ఎప్పుడు పూర్తి అవుతుందో మరి, ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో,

Advertisement
Mahesh babu Rajamouli cinema cancel
Mahesh babu Rajamouli cinema cancel

రాజమౌళికి ఎప్పుడు కాల్ షీట్స్ ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే రాజమౌళి ఈ సినిమాను హోల్డ్ లో పెట్టి మరో చిన్న సినిమాను తెరకెక్కించే విధంగా ఆలోచిస్తున్నారట. లవ్ ఫ్యామిలీ డ్రామా స్క్రిప్టును కూడా జక్కన్న రెడీ చేసుకున్నారట. అన్ని కుదిరితే ఆరు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కూడా చేస్తారట. ఆ తర్వాత మహేష్ బాబు తో సినిమాను తెరకెక్కించే ఆలోచన చేస్తారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం దీనికి హర్ట్ అవుతున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఆపేస్తే పెద్ద యుద్ధమే జరిగిపోతుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే మహేష్ బాబు కానీ రాజమౌళి కానీ దీనిపై స్పందించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement