Mahesh Babu Rajamouli : రాజమౌళి మహేష్ బాబు అన్ని సంచలనాలే.. రెమ్యూనరేషన్ లేకుండానే ఆ సెంటిమెంట్ కూడా బ్రేక్ చేసి మరి..!
ప్రధానాంశాలు:
Mahesh Babu Rajamouli : రాజమౌళి మహేష్ అన్ని సంచలనాలే.. రెమ్యూనరేషన్ లేకుండానే ఆ సెంటిమెంట్ కూడా బ్రేక్ చేసి మరి..!
Mahesh Babu Rajamouli : రాజమౌళి మహేష్ బాబు కాంబో సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. హైదరాబాద్ శివార్లలోని అల్యుమినం ఫ్యాక్టరీలో ఫార్మల్ పూజా విధానం జరిగిందని తెలుస్తుంది. ఐతే మీడియాకు ఎలాంటి లీక్ రాకుండా కేవలం చిత్ర యూనిట్ సమక్షంలోనే ఈ పూజా జరిగినట్టు తెలుస్తుంది. ఐతే గత కొన్నళ్లుగా తన సినిమా పూజా కార్యక్రమాలకు మహేష్ వెళ్లట్లేదు. మహేష్ సతీమణి నమ్రతనే పూజకు వెళ్తుంది. ఐతే ఇప్పుడు ఆ సెంటిమెంట్ కి బ్రేక్ చేసి మహేష్ పూజలో పాల్గొన్నాడు. అంతేకాదు ఈ సినిమా విషయంలో మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నాదట మహేష్. అదేంటి అంటే ఈ సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా పనిచేయాలని ఫిక్స్ అయ్యాడట. మహేష్ ఏంటి రాజమౌళి సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా పనిచేయడం ఏంటి అని షాక్ అవ్వొచ్చు. సినిమాకు రెమ్యునరేషన్ గా తీసుకోకుండా బిజినెస్ పర్సెంటేజ్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారట.
Mahesh Babu Rajamouli బిజినెస్ లో పర్సెంటేజ్ తీసుకునే ..
ఇదివరకు చాలా సినిమాలకు మహేష్ ఇలానే రెమ్యునరేషన్ లేకుండా బిజినెస్ లో పర్సెంటేజ్ తీసుకునే వాడు. ఈమధ్య అది తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు రాజమౌళి సినిమాకు అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి ఈ ఇద్దరు కలిసి హాలీవుడ్ రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.
2025 జనవరి 2 మహేష్ రాజమౌళి సినిమా పూజ జరిగింది. సినిమాను 2027 సెకండ్ హాఫ్ రిలీజ్ అంటున్నారు. మరి ఈ సినిమానైనా రాజమౌళి అనుకున్న టైం కు పూర్తి చేస్తాడా లేదా అన్నది చూడాలి. రాజమౌళి ఈ సినిమాతో ఆస్కార్ ని టార్గెట్ పెట్టాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని తీసుకునే ప్లానింగ్ లో ఉన్నారు. పృధ్విరాజ్ సుకుమారన్ కూడా మహేష్ సినిమాలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. కాస్టింగ్ విషయంలో కూడా జక్కన్న ప్లాన్ అదిరిపోయేలా ఉందని తెలుస్తుంది. మరి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. Mahesh Babu, Rajamouli, SSMB29, Rajamouli Movie, Mahesh Sentiment