Mahesh Babu Rajamouli : పెద్ద ట్విస్టే ఇచ్చారుగా… రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదా..!
ప్రధానాంశాలు:
Mahesh Babu Rajamouli : పెద్ద ట్విస్టే ఇచ్చారుగా... రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదా..!
Mahesh Babu Rajamouli : తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి SS Rajamouli చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్న విషయం మనందరికి తెలిసిందే. సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్ రేంజ్‌ను పెంచుతూ ఇప్పుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు టార్చ్ బేరర్‌గా మారారు రాజమౌళి. కమర్షియల్ సినిమానే కొత్తగా ప్రజెంట్ చేయడంలో ఆయన రూటే సపరేట్.ఓ ప్రాంతీయ సినిమాపై రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టి రెండు భాగాలుగా తీసి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా బాహుబలిని నిలబెట్టారు రాజమౌళి.
Mahesh Babu Rajamouli మాములోడు కాదు..
కొద్ది నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అదే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను అందుకుని భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబును చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడు రాజమౌళి.
అయితే ఈ ఓపెనింగ్ ఈవెంట్ ను బయటకుచూపించకపోవడానికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ఈవెంట్ ను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబులో చాలా మార్పు కనిపిస్తోంది. ఆయన కొన్నేళ్ళుగా పాటిస్తున్న కొన్ని సెంటిమెంట్స్ ను బ్రేక్ చేశాడు మహేష్. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్లలో నుంచి 40% షేర్ మహేష్ బాబు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. అదే విషయాన్ని ప్రొడ్యూసర్స్ తో కూడా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి 40% తీసుకుంటూనే రెండో భాగం పైన వచ్చే ప్రాఫిట్ లో కూడా 40% వాట తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. అంటే మహేష్ భారీగానే అందుకోనున్నాడని అంటున్నారు. ఏదైన మహేష్ ప్లానే వేరంటున్నారు