Sarkaru Vaari Paata : మహేష్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ కళావతి ప్రోమో వచ్చేసింది
Sarkaru Vaari Paata : మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం… సర్కారు వారి పాట. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో కళావతి అనే సాంగ్ ప్రోమో ని చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ ప్రోమో లో కీర్తి వెంట మహేష్ బాబు పడుతూ… తన ప్రేమను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కీర్తి సురేశ్ ను చాలా అందంగా చూపించాడు దర్శకుడు. ఇక మహేష్ కూడా కాస్త కొత్త లుక్ లో కనపడుతున్నాడు.

Mahesh Babu Sarkaru Vaari Paata Movie Kalaavathi Song Promo
భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాలో తమన్ సంగీతం గురించి అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అఖండ సినిమాతో తమన్ సంగీతం పై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.
